సైరా కు ఆయనే సంగీతం.. ఇది పక్కా!

Update: 2018-08-16 12:56 GMT
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'సైరా' ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే.  ఈ సినిమాకు మొదట ఆస్కార్ అవార్డు విన్నర్ AR రహమాన్ ను సంగీత దర్శకుడిగా  తీసుకున్నారు. కానీ ఎందుకో రహమాన్ ఈ సినిమా నుండి తప్పుకోవడంతో వేరే సంగీత దర్శకుడి కోసం వెతకడం మొదలు పెట్టారు.
 
థమన్.. కీరవాణి ల పేర్లు వినిపించినా అవేవీ ఫైనల్ కాలేదు.  కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదీ ని తీసుకున్నట్టుగా టాలీవుడ్ లో వార్తలు వినిపించాయి. కానీ అధికారికంగా 'సైరా' టీమ్ ఆ వార్తలపై స్పందించలేదు.  కానీ ఇప్పుడు మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఎలాగంటారా?  రీసెంట్ గా 'సైరా' టీమ్ సినిమా టీజర్ ను ఆగష్టు 21 వ తారీఖున ఉదయం 11.30 గంటలకు రిలీజ్ చేస్తామని ప్రకటిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు.  అందులో సంగీత దర్శకుడిగా అమిత్ త్రివేది పేరు ఉంది.

దీంతో ఫుల్ క్లారిటీ వచ్చినట్టే. మరి ఈ అమిత్ ఏ సినిమాలకు పని చేశారో తెలుసా? దాదాపుగా యాభై కి పైగా సినిమాలకు సంగీతం అందించాడు.  అందులో ఎక్కువ సినిమాలు ఎక్స్పరిమెంట్ కంటెంట్ ఉన్నవే.  'దేవ్ డీ'.. 'వేకప్ సిడ్'.. 'ఇష్క్ జాదే'.. 'ఇంగ్లీష్ వింగ్లిష్'.. 'కై పో చే'.. 'బాంబే టాకీస్'.. 'బాంబే వెల్వెట్'.. 'క్వీన్'... లిస్టు మరీ పెద్దదైంది చాలు కదా!  సరే ఈయన ట్యూన్స్ లో ఒక సూపర్ హిట్ హిందీ మెలోడీ చెప్పమంటే అది..  'పరేషాన్ పరేషాన్'.  'ఇష్క్ జాదే' సినిమాలో అర్జున్ కపూర్-పరిణీత చోప్రా ల మీద ఈ సాంగ్ ఉంటుంది. మనసుని ఎక్కడికో తీసుకెళ్ళి పోతుంది.  మరి అమిత్ మన మెగాస్టార్ కు కూడా సూపర్ హిట్ సంగీతం ఇవ్వాలని కోరుకుందాం!
Tags:    

Similar News