మాస్టర్ స్టోరీ టెల్లర్, దర్శకధీరుడు రాజమౌళి సినిమాల మీద అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జక్కన్న రూపొందించిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ భారీ యాక్షన్ డ్రామాని కొత్త ఏడాది 2022 ప్రారంభంలో జనవరి 7న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
'బాహుబలి' తరహాలోనే RRR కూడా భారీ విజువల్ ఫీస్ట్ గా ఉంటుందని ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ని బట్టి అర్థం అవుతోంది. ప్రమోషన్స్ మీద ఫోకస్ పెట్టిన చిత్ర బృందం.. ప్రస్తుతం వరుస ప్రచార కార్యక్రమాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ ఫిక్షనల్ పీరియాడికల్ మూవీకి దేశవ్యాప్తంగా మంచి బజ్ ఏర్పడింది.
ఇకపోతే RRR చిత్రంలో జక్కన్న యాక్షన్ తో పాటుగా భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమోషనల్ కంటెంట్ ను హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో చూపించడంలో రాజమౌళికి సాటిలేరు. ఏ సీన్ కైనా ఎమోషన్ ని జోడించి చూపించినప్పుడే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని ఆయన భావిస్తుంటారు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ లో కూడా ప్రతి 10 నిమిషాలకు ఓ హై ఎమోషనల్ సీన్ ఉండబోతోందని తెలుస్తోంది.
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీలో ప్రతి ఫ్రేమ్ లో ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుందని.. ‘నాటు నాటు’ పాటలో సైతం ఓ ఎమోషన్ ఉంటుందని.. అది అభిమానులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని రాజమౌళి హామీ ఇచ్చారు. 'బాహుబలి' సినిమా నచ్చినవారికి.. తప్పకుండా ట్రిపుల్ ఆర్ కూడా నచ్చుతుందని నమ్మకంగా చెబుతున్నారు. మరి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
కాగా, స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత స్వభావాల ఆధారంగా కల్పిత కథతో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామరాజుగా రామ్ చరణ్.. భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. అలియా భట్ - ఒలివియా మోరిస్ - అజయ్ దేవగన్ - శ్రియా శరణ్ - సముద్ర ఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.