బాహుబలి సినిమా సామాన్య ప్రేక్షకుల్ని మాత్రమే కాదు.. ఎప్పుడూ సినిమాల గురించి మాట్లాడని వాళ్లను కూడా స్పందింపజేస్తోంది. ఇప్పటికే మన రాష్ట్రంలో రాజకీయ ప్రముఖులు, అధికారులు సినిమా మీద తమ స్పందన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ‘బాహుబలి’ లాంటి అద్భుతమైన సినిమా తీసినందుకు రాజమౌళి అండ్ టీమ్‌ను అభినందల్లో ముంచెత్తారు. ఇక బాలీవుడ్‌లో అయితే శేఖర్ కపూర్ లాంటి లెజెండరీ డైరెక్టర్‌ను కూడా ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది. ఐతే ఈ ప్రశంసలన్నీ ఓ ఎత్తు.. ఎన్నడూ సినిమాల ఊసే ఎత్తని ఓ వ్యాపార దిగ్గజం కూడా బాహుబలి గురించి స్పందించడం మరో ఎత్తు.
దేశంలోని కుబేరుల్లో ఒకరైన మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా బాహుబలి గురించి ట్వీట్లు చేయడం బాలీవుడ్ జనాలకు కూడా పెద్ద షాక్. ‘‘బాహుబలి ఒక గొప్ప అచీవ్‌మెంట్. భారతీయ పురాణాలు, జానపదాల్లోని గొప్పదనాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. నాకిది హాలీవుడ్ సినిమాలా అనిపించలేదు. ఇందులో ఇండియన్ డీఎన్ఏ ఉంది. సౌండ్ ట్రాక్ మాయాజాలం, సృజనాత్మకమై రొమాంటిక్ సీన్స్ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి’’ అంటూ ఓ సినీ విశ్లేషకుడిలా ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. రాజమౌళి అండ్ టీమ్‌కు ఇంతకంటే పెద్ద ప్రశంస మరొకటి ఉండదేమో.