చెన్నై నుంచి తెలుగు సినీ పరిశ్రమని హైదరాబాద్ కి తీసుకు రావడం కోసం ఎన్.టి.ఆర్, ఏయన్నార్ లాంటి వారు చాలా కృషి చేశారు. మన దగ్గర స్టూడియోస్ లేకపోవడం వల్లే అక్కడ దాకా వెళ్లాల్సి వస్తుందని అనుకుని రామకృష్ణ, అన్నపూర్ణ స్టూడియోస్ రూపొందించారు. సిటీ నడిబొడ్డున బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏరియాలకు దగ్గరగా ఉండే అన్నపూర్ణ స్టూడియోస్ అంటే సినీ పరిశ్రమ అడ్డాగా చెప్పొచ్చు. అక్కడ సినిమాకు సంబంధించిన అన్ని పనులు జరుగుతుంటాయి.
స్టార్ హీరో సినిమా దగ్గర నుంచి స్మాల్ బడ్జెట్ సినిమా వరకు అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి. షూటింగ్.. ఎడిటింగ్.. డబ్బింగ్.. ఈవెంట్స్.. ఇలా అన్నిటికీ అన్నపూర్ణ అందుబాటులో ఉంటుంది. కేవలం సినిమాలే కాదు ఎన్నో రకాల రియాలిటీ షోస్ కి కూడా అన్నపూర్ణ స్టూడియోస్ వేదిక అవుతుంది. సినీ స్టూడియో అన్ని రకాల సినిమా రిలేటెడ్ ఫెసిలిటీస్ అందిస్తుంది. అయితే ఇప్పుడు సరికొత్తగా మరో అడ్వాన్స్డ్ ఫిల్మ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ని ప్రవేశ పెడుతుంది. అదేంటి అంటే అన్నపూర్ణ స్టూడియోలో కొత్తగా స్టేట్ ఆఫ్ ది స్టార్ట్ ఎల్.ఈ.డి వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్ ని ఏర్పాటు చేస్తున్నారట.
ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త పద్ధతిని తీసుకొస్తున్నారట. ఇది భవిష్యత్తులో సినిమా ప్రొడక్షన్ రూపాన్ని మార్చేస్తుందని అంటున్నారు స్టూడియో యూనిట్. ఏదైనా కొత్తగా ప్రయత్నించాలంటే నాగార్జునకి చాలా ఇష్టం. అది సినిమాలైనా.. స్టూడియో అయినా.. అందుకే అన్నపూర్ణ స్టూడియో లో ఈ సరికొత్త ఎల్.ఈ.డి వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారట.
రీసెంట్ గా చెన్నైలోని ప్రముఖ ఏ.వి.ఎం స్టూడియోస్ తమ స్టూడియోని మ్యారేజ్ ఫంక్షన్స్ కి వాడుకోవచ్చని ఒక ఎనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఆ స్టూడియోలో ఎన్నో పెద్ద సినిమాలు చేయగా అలాంటి సంస్థ సినిమాలు చేయకుండా ఫంక్షన్స్ కి దాన్ని వాడాలని ప్రయత్నించడం సినీ లవర్స్ ని షాక్ ఇచ్చింది.