'ఆదిపురుష్‌' క్రేజ్‌ ను పెంచేలా మరో స్టార్‌

Update: 2021-04-05 08:30 GMT
ప్రభాస్‌ మొదటి హిందీ చిత్రం 'ఆదిపురుష్‌' పై అంచనాలు ఏ రేంజ్‌ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓం రౌత్‌ రద్శకత్వంలో దాదాపు 500 కోట్ల బడ్జెట్‌ తో రూపొందుతున్న ఈ సినిమా భారీ విజువల్‌ వండర్‌ లా ఉంటుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సినిమా లో ప్రభాస్‌ రాముడి పాత్రను పోషిస్తూ ఉండగా కృతి సనన్‌ సీత పాత్రలో కనిపించబోతుంది. ఇక బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడి పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఇంకా ప్రముఖులు ఈ సినిమాలో నటించబోతున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఈ సినిమాలోని కీలకమైన ఒక పాత్రకు గాను బాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజోల్‌ ఎంపిక అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. సినిమాలో కాజోల్‌ పాత్ర ఏంటీ అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. రావణాసూరుడి భార్య మండోదరి పాత్రలో ఈమె కనిపించబోతుందని బాలీవుడ్‌ లో ఒక వర్గం వారు చెబుతున్నారు. కాని అసలు విషయం ఏంటీ అనేది చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి క్లారిటీ వచ్చే వరకు వెయిట్‌ చేయాల్సిందే. సినిమాలో కాజోల్‌ నటించడం వల్ల ఖచ్చితంగా అంచనాలు మరింతగా పెరగడం ఖాయం. ఆదిపురుష్‌ సినిమా లో ప్రతి పాత్రకు కూడా ప్రముఖ నటీనటులను తీసుకోవడం వల్ల సినిమా స్తాయిని అమాంతం పెంచేస్తున్నారు.

ప్రభాస్‌ కు ఉన్న పాన్‌ ఇండియా స్టార్‌ డంకు తోడు ఆదిపురుష్‌ సినిమాను భారీ బడ్జెట్‌ తో అద్బుతమైన విజువల్‌ వండర్‌ గా రూపొందిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా బాహుబలి 2 రికార్డులను బ్రేక్‌ చేస్తుందంటూ సినీ వర్గాల వారు సైతం అంటున్నారు. హాలీవుడ్‌ సినిమాల రేంజ్‌ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న దర్శకుడు ఓం రౌత్‌ వీఎఫ్‌ఎక్స్‌ కోసం విదేశీ టెక్నీషియన్స్‌ ను ఉపయోగిస్తున్నాడు. హాలీవుడ్‌ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని బాలీవుడ్‌ మీడియా వర్గాల వారు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఆగస్టులో సినిమా విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటన వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్‌ మరో రెండు మూడు నెలల్లోనే పూర్తి చేసేలా ప్లాన్‌ చేస్తున్నారని కూడా చెబుతున్నారు. షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత కనీసం ఏడాది కాలం పాటు వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ జరుపబోతున్నారట. అంత భారీగా వీఎఫ్‌ ఎక్స్‌ వర్క్‌ జరుగబోతుంది అంటే సినిమా ఏ రేంజ్‌ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ ను రాముడిగా ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News