'ఆహా'లోకి మరో సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్..!

Update: 2021-05-17 17:30 GMT
దేశంలో కరోనా పరిస్థితి నెలకొన్నప్పటి నుండి ప్రతి రంగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. అందులో ముఖ్యంగా సినిమా రంగంలో చాలా మార్పులు జరిగాయి. దేశం మొత్తం మీద సినీరంగమే బాగా మార్పు చెందిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యాపారం - రాజకీయం అనేవి ఎప్పటికప్పుడు మార్పులు చెందుతూనే ఉంటాయి. కానీ సినీ రంగంలో మార్పులు అరుదుగా కనిపిస్తాయి. అందులోను టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్స్ హీరోలు అయిపోవడం.. యాంకర్స్ హీరోయిన్స్ అయిపోవడం.. ఇలా ఎన్నో మార్పులు చూస్తున్నాం.

అయితే ఇంతమంది వివిధ రకాలుగా బిజీ అవుతున్నారు అంటే  కారణం ఓటిటిలు. దేశంలో కరోనా మొదలైనప్పుడే ఓటిటిల వాడకం కూడా పెరిగింది. గతేడాది ముందు వరకు ఓటిటి అంటే.. థియేటర్లలో ఆడిన సినిమాలు ఓటిటిలో స్ట్రీమింగ్ అయ్యేవి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం కొత్త సినిమాలు - వెబ్ సిరీసులు కూడా నేరుగా ఓటిటి రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఓటిటిలకు అలవాటు పడిన ప్రేక్షకులు కూడా ఎలాగో థియేటర్స్ ఓపెన్ లేవు కదా సినిమాలు ఓటిటి రిలీజ్ చేయాలనీ ఇష్టపడుతున్నారు. అయితే ఈ క్రమంలో స్టార్ హీరోలు - హీరోయిన్స్ ఓటిటి మూవీస్ - వెబ్ సిరీస్ లలో నటించేందుకు సిద్ధం అవుతున్నారు.

అయితే తెలుగు ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నటువంటి ఓటిటి ఆహా. గతేడాది ప్రారంభిమైన ఈ ఓటిటి ప్రస్తుతం మంచి ఫాలోయర్స్ తో విజయవంతంగా రన్ అవుతోంది. అయితే కమెడియన్ ప్రియదర్శి - నందిని రాయ్ కాంబినేషన్ లో ఓ సస్పెన్సు థ్రిల్లర్ వెబ్ సిరీస్ సిద్ధం అవుతోందట. సీనియర్ స్టార్ డైరెక్టర్ సురేష్ కృష్ణ నిర్మాతగా మారి ఈ వెబ్ సిరీస్ నిర్మించనున్నారు. న్యూ డైరెక్టర్ విద్యాసాగర్ దర్శకత్వం తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ కు 'ఐ.ఎన్.జి' అనే పేరు ఖరారు చేశారు. కానీ ఐ.ఎన్.జి అనే ఫుల్ ఫామ్ ఏంటి అనేది రివీల్ చేయలేదు. అయితే పూర్తి డీటెయిల్స్ మే 18న అంటే రేపు ప్రకటించనున్నట్లు తెలిపారు.
Tags:    

Similar News