ఈ ఏడాది ఆరంభంలో బాలీవుడ్ లో విడుదలైన అయిన అత్యంత వివాదాస్పద చిత్రం 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'. ఈ చిత్రం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రభుత్వంలో ఎలాంటి పాత్రలను పోషించారు అనే విషయాన్ని ఆ చిత్రంలో చూపించడం జరిగింది. సినిమాపై మొదట అంచనాలు భారీగా వచ్చాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత నిరాశ పర్చింది. అంచనాలను అందుకోవడంలో సినిమా విఫలం అయ్యింది. తాజాగా ఆ చిత్రంలో రాహుల్ గాంధీ పాత్రను పోషించిన నటుడు అర్జున్ మాథుర్ చిత్రంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు.
'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' లో మన్మోహన్ సింగ్ పాత్రను ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ పోషించగా, సోనియా గాంధీ పాత్రను జర్మనీ నటి, ప్రియాంక గాంధీ పాత్రను అహానా కుమ్రా పోషించింది. ఈ చిత్రంలో రాహుల్ గాంధీ పాత్రను పోషించింనందుకు నాపై నాకే అసహ్యంగా ఉందని, అలాంటి పాత్రను ఎందుకు చేశానా అని ఎన్నో సార్లు అనుకున్నాను అంటూ నటుడు అర్జున్ మాథుర్ అన్నాడు. సినిమాపై చాలా నమ్మకం పెట్టుకుని చేశాను, కాని సినిమా నన్ను తీవ్రంగా నిరాశ పర్చిందని తాజాగా పాల్గొన్న ఒక టాక్ షోలో చెప్పుకొచ్చాడు.
ఒక సినిమాలో నటించినప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన మరీ ఇంతలా వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం భావ్యం కాదు అంటూ అర్జున్ మాథుర్ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక అదే టాక్ షోలో అర్జున్ ప్రముఖ నటుడు సిద్దార్థ్ మల్హోత్రపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయనకు నటన రాకున్నా కూడా అదృష్టం కొద్ది స్టార్ అయ్యాడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలు అయ్యాడు. అర్జున్ ఫ్రస్టేషన్ లో ఇలా మాట్లాడుతున్నాడనే విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి.