టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రధాన పాత్రలో పూర్తిగా గ్రాఫిక్స్ తో రూపొందుతున్న వెబ్ సిరీస్ 'అథర్వ'. ఈ వెబ్ సిరీస్ ను ఒక నవల ఆధారంగా రూపొందించడం జరిగింది. ఆ నవల పేరు 'అథర్వ ః ది ఆరిజన్'. అత్యంత విభిన్నమైన కథగా చెబుతున్నారు. అథర్వ నవలకు సంబంధించిన ట్రైలర్ ను మరియు బుక్ యొక్క కవర్ పేజీని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు.
అథర్వ నవల ట్రైలర్ ధోనీ మాటలతో ఆరంభం అవుతుంది. ఒక అద్బుతమైన ఫీలింగ్ ను కలిగించేలా నవల కథ ఉంటుందని.. అంతే కాకుండా రియల్ క్యారెక్టర్స్ ను తలపించేలా గ్రాఫిక్స్ ఫోటోలను బుక్ లో ముద్రించడం జరిగిందని ధోనీ వీడియో లో పేర్కొన్నాడు. అంతే కాకుండా ఈ బుక్ ను అమెజాన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు అంటూ కూడా ధోనీ చెప్పుకొచ్చాడు.
ఇక ఈ నవల ట్రైలర్ ఆవిష్కరణ సందర్బంగా సూపర్ స్టార్ రజినీ కాంత్ మాట్లాడుతూ అథర్వ నవలకు మంచి ఆధరణ దక్కాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. పుస్తకం అద్బుతంగా డిజైన్ చేశారని.. కథ తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఉంటుందనే నమ్మకంను వ్యక్తం చేశాడు. కథ లో అక్కడక్కడ వచ్చే ఫోటోలు మరియు పాత్రలకు సంబంధించిన విషయాలను పుష్పకంను చాలా ప్రత్యేకంగా మల్చాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా పవర్ ఫుల్ గా ఉండటంతో కీలక పాత్ర అయిన అథర్వ ను పరిచయం చేయడం కూడా జరిగింది. ధోనీ యానిమేషన్ మోడల్ ను ట్రైలర్ చివర్లో చూపించారు. వెబ్ సిరీస్ ను కూడా ఇదే జోష్ తో పట్టాలెక్కిస్తారా అనేది చూడాలి. నవలకు వస్తున్న రెస్పాన్స్ నేపథ్యంలో వెబ్ సిరీస్ స్పీడ్ పెంచే అవకాశాలు మరింతగా ఉన్నాయి.
Full View