ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రదర్శితం అయ్యాక లేటుగా ఇండియాకు వచ్చేవి. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారింది. మన దగ్గర డైరెక్టుగా భారీ స్థాయిలో హాలీవుడ్ సినిమాలు రిలీజైపోతున్నాయి. అందుకు తగ్గట్లే వసూళ్లు కూడా భారీగా ఉంటున్నాయి. ‘జంగిల్ బుక్’ ఇండియాలో ఏకంగా రూ.300 కోట్ల దాకా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వసూళ్లను ఓ కొత్త సినిమా దాటేసేలా కనిపిస్తోంది. అదే.. ఏవెంజర్స్. ఈ సిరీస్‌లో వస్తున్న కొత్త సినిమా ఇండియాలో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని ఇండియాలో ఏకంగా 2 వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తుండటం విశేషం. హిందీ సినిమాలు.. దక్షిణాదిన రజినీకాంత్ సినిమాల తప్పిస్తే ఈ స్థాయిలో ఇండియన్ మూవీస్ రిలీజవడం అరుదు.
ఈ చిత్రానికి ముందు నుంచి మంచి హైప్ ఉంది. సూపర్ హీరోలందరూ కలిసి ఒక లక్ష్యం కోసం పోరాడే కథతో తెరకెక్కిన సినిమా ఇది. భారీ ప్రమోషన్లతో ఈ చిత్రానికి హైప్ బాగా పెంచారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే మొదలవగా.. రెస్పాన్స్ అదిరిపోయిందంటున్నారు. ఇండియాలో ఈ వారం అత్యధికంగా సెర్చ్ చేసిన సినిమాల్లో ‘ఏవెంజర్స్’ మూడో స్థానంలో ఉండటం విశేషం. అటు హిందీలో.. ఇటు దక్షిణాదిన ఈ వారం భారీ సినిమాలేమీ రిలీజ్ కాని సమయంలో ‘ఏవెంజర్స్’ ప్రేక్షకుల ముందుకొస్తోంది. కాబట్టి ఓపెనింగ్స్ అనూహ్యంగా ఉంటాయని.. ఇప్పటిదాకా ఇండియాలో ఏ హాలీవుడ్ మూవీకి లేని స్థాయిలో ఆరంభ వసూళ్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రపంచ స్థాయిలో ఓపెనింగ్ వీకెండ్లో 200 మిలియన్ డాలర్ల ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ పండిట్లు అంటున్నారు.