సెకండాఫ్‌ బాహుబలితోనే బోణీ

Update: 2015-07-08 06:28 GMT
హిందీ చిత్రసీమలో ఇటీవలి కాలంలో అనూహ్య మార్పులొచ్చాయి. స్టార్‌ పవర్‌ ఉన్న సినిమాల కంటే కథా బలం, వైవిధ్యం ఉన్న సినిమాలకు పట్టంగడుతున్నారక్కడ. ఈ ఏడాది ప్రథమార్థం ముగిసింది. అక్షయ్‌ కుమార్‌ బేబి తప్ప మిగతావన్నీ స్టార్‌ పవర్‌ లేని సినిమాలే. కంగన, దీపిక వంటి భామలు నటించిన సినిమాలు బాక్సాఫీస్‌ని గడగడ లాడించాయి. నాయికా ప్రాధాన్య చిత్రాలే పెద్ద విజయం సాధించాయి.

ఇప్పుడిక 2015 సెకండాఫ్‌ మొదలైంది. బాహుబలి మొదలు భారీ చిత్రాలెన్నో రిలీజవుతున్నాయి. మునుముందు భారీ వసూళ్లతో రికార్డుల ఫర్వానికి తెరలేవనుంది. బాలీవుడ్‌ సెకండాఫ్‌పై ఓ లుక్కేద్దాం పదండి.

ఈ నెలలో అక్కడ రిలీజవుతున్న మొట్టమొదటి భారీ చిత్రం 'బాహుబలి'. ప్రభాస్‌, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా నటీనటులుగా రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. బాలీవుడ్‌లో కరణ్‌జోహార్‌ రిలీజ్‌ చేస్తున్నారు కాబట్టి హిందీ సినిమాలతో సమానంగా అంచనాలేర్పడ్డాయి. ఈ చిత్రం ఉత్తరాది అంతటా ఈనెల 10న భారీగా రిలీజవుతోంది. సరిగ్గా బాహుబలి రిలీజైన వారానికి సల్మాన్‌ఖాన్‌ - కరీనకపూర్‌ జంటగా నటించిన భజరంగి భైజాన్‌ (17న) రిలీజవుతోంది. ఆ తర్వాత స్టార్‌ పవర్‌ ఉన్న మరిన్ని సినిమాలు రిలీజ్‌లకు వస్తున్నాయి. అక్షయ్‌కుమార్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా కథానాయకులుగా తెరకెక్కిన బ్రదర్స్‌ ఆగస్టు 14న రిలీజవుతోంది. ఆ తర్వాత సెప్టెంబర్‌ 18న కంగన రనౌత్‌, ఇమ్రాన్‌ జంటగా నటించిన కట్టి బట్టి రిలీజవుతోంది.

ఎప్పటినుండో అందరూ వెయిట్‌ చేస్తున్న.. ఐశ్వర్యారాయ్‌ రీఎంట్రీ చిత్రం జజ్బా అక్టోబర్‌ 9 రిలీజ్‌కి రెడీ అవుతోంది. అమితాబ్‌ వాజిర్‌ డిసెంబర్‌ రిలీజ్‌కి సిద్ధం. వీటన్నిటితో పాటు దిల్‌ వాలే దుల్హానియా లేజాయేంగే (డిడిఎల్‌జె) జంట షారూక్‌-కాజోల్‌ నటంచిన 'దిల్‌ వాలే' డిసెంబర్‌ 18న రిలీజవుతోంది. ఇవన్నీ ద్వితీయార్థంలో క్రేజీయెస్ట్‌ ప్రాజెక్ట్స్‌. వీటితో సైఫ్‌-కత్రిన జంటగా 26/11 ముంబై దాడుల అనంతర పరిణామాల నేపథ్యంలో పాంటమ్‌ సెప్టెంబర్‌లో రిలీజవుతోంది.  షాహిద్‌-ఆలియా షాన్‌ దార్‌, సూరజ్‌ పాంచోళీ-హీరో (సునీల్‌ శెట్టి తనయ ఆతియ నాయిక) చిత్రాలు క్రేజీ ప్రాజెక్టులుగా రిలీజవుతున్నాయి.

ఈ సినిమాలన్నింటిలో బాహుబలి రొటీనిటీకి భిన్నంగా వస్తున్న క్రేజీ ప్రాజెక్టుగా పేరు తెచ్చుకుంది. మరి మన రాజమౌళి అండ్‌ టీమ్‌ అక్కడ ఎలా బోణి కొడతారో చూద్దాం.

Tags:    

Similar News