తెలుగు సినీ పరిశ్రమ అగ్రహీరో ...హిందుపూర్ ఎమ్మెల్యే నందమూరి నటసింహం బాలకృష్ణ జూన్ 10తో 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభసందర్భంలో ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఆయన అభిమానులు. ఈ సందర్భంగా బాలకృష్ణ వివిధ చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ పలు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ తరుణంలోనే రాజకీయ భవిష్యత్ పై పలు ప్రశ్నలు అడగ్గా బాలయ్య తనదైన శైలిలో స్పందించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు గురించి కొంత మంది వెన్నుపోటు గాడిదగుడ్డు అని మాట్లాడుతుంటారని అవి తనకు అర్థం కావని , ఇప్పటి పరిస్థితిని బట్టి అందరం కలిసి పార్టీని కాపాడుకుంటూ ఉన్నామని, అందులో తాము కూడా ఉన్నామని తిరిగి అధికారంలోకి కూడా వచ్చామన్నారు. అలాగే, తాను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేయడం అనేది కాలమే నిర్ణయిస్తుందని, అన్నింటికీ తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో హిందూపుర్ నిజయోజకవర్గం నుండి పోటీకి దిగి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన బాలయ్య ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ..తొలిసారిగా చట్టసభలో అడుగుపెట్టారు. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయినా కూడా బాలకృష్ణ హిందూపుర్ నుండి వరుసగా రెండోసారి కూడా ఘన విజయం సాధించారు.
ఇకపోతే ఈ మద్యే లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగ్స్ ఆగిపోయిన సందర్భంగా దానిపై తెలంగాణ ప్రభుత్వంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు జరిపిన చర్చలు గురించి తనని పిలవలేదని బాలయ్య చెప్పిన మాటలు పెను దుమారాన్ని రేపాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు మంత్రి తలసానితో కలిసి భూములు పంచుకోవడానికి మాత్రమే కలిసారంటూ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై మెగా బ్రదర్.. బాలయ్యను నోరు అదుపులో పెట్టుకోమంటూ చెప్పిన మాటలు పెను దుమారన్నే రేపాయి.