బెంగాల్ టైగ‌ర్ బ‌తికిపోయింది పో

Update: 2015-12-29 05:50 GMT
రొటీన్ కంటెంట్ తో తీసినా మాస్ జ‌నాల్ని ఆక‌ట్టుకుంటే చాలు సేఫ్ సైడ్ అయిపోవ‌చ్చు అన‌డానికి ఈ ఉదాహ‌ర‌ణ చాలు. స‌రిగ్గా 18 రోజుల క్రితం రిలీజైంది బెంగాల్ టైగ‌ర్ మూవీ. ఇన్నిరోజులు థియేట‌ర్ల‌లో ఉండ‌డ‌మే గ‌గ‌నం అనుకుంటే .. ఈ మూవీ ఆల్ మోస్ట్ బ‌య్య‌ర్లు - డిస్ర్టిబ్యూట‌ర్ల‌కు న‌ష్టాలు మిగల్చ‌కుండా ముగింపునివ్వ‌డం టాలీవుడ్‌ లో చ‌ర్చ‌కొచ్చింది. ఇటీవ‌లి కాలంలో రిలీజైన సౌఖ్యం - మామ మంచు లాంటి సినిమాల‌తో పోలిస్తే చాలా బెట‌ర్ మూవీ అన్న టాక్ తెచ్చుకుంది టైగ‌ర్‌.
      
18 రోజుల్లో క‌లెక్ష‌న్ల డీటెయిల్స్ ప‌రిశీలిస్తే వ‌ర‌ల్డ్ వైడ్ 21.8 కోట్ల షేర్‌ వ‌సూలు చేసింది. కేవ‌లం ఏపీ - తెలంగాణ‌లో 18.09కోట్ల షేర్ వ‌సూలు చేసింది. క‌ర్నాట‌క నుంచి 2.17 కోట్లు - అమెరికా నుంచి 1కోటి - ఇత‌ర చోట్ల‌నుంచి 55 ల‌క్ష‌లు వ‌సూలు చేసింది. వాస్త‌వానికి ప‌బ్లిసిటీ వ‌గైరా వ‌గైరా క‌లుపుకుని ఈ సినిమా థియేట‌ర్ రైట్స్ 22 కోట్లకు క్ర‌య విక్ర‌యాలు జ‌రిగాయ్‌. ఆ మేర‌కు బాక్సాఫీస్‌ వ‌సూళ్లు న‌ష్టాల్లేకుండా వ‌చ్చిన‌ట్టేన‌ని విశ్లేషిస్తున్నారు. చిన్న‌పాటి న‌ష్టం మిన‌హా ఆల్ మోస్ట్ డిస్ర్టిబ్యూట‌ర్లంతా సేఫ్ అయిన‌ట్టేన‌ని అనుకుంటున్నారు.

అయితే ఇప్పుడున్న స‌న్నివేశంలో ఇలా ఓ సినిమా న‌ష్టాల పాల‌వ్వ‌కుండా కాపాడ‌డం అంటే ఆషామాషీ కాదు. ద‌ర్శ‌కుడు సంప‌త్ నందికే ఈ క్రెడిట్ ద‌క్కుతుంది. రొటీన్‌ గా తీసినా మాస్‌ ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించి నిర్మాత‌ను సేఫ్ సైడ్‌ లో నిల‌బెట్ట‌డం ఎలానో తెలిసిన ద‌ర్శ‌కుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఒక‌వేళ ప‌వ‌న్‌ తో స‌ర్ధార్ గ‌బ్బ‌ర్‌ సింగ్ తీసి ఉన్నా రొటీన్‌ గా తీసి ఫ‌ర్వాలేద‌నిపించేవాడేమో?
Tags:    

Similar News