డార్లింగ్ మంచితనానికి ఫిదా అయిన మరో బాలీవుడ్ బ్యూటీ..!

Update: 2020-05-24 12:35 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'జిల్' ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ మరియు గోపీ కృష్ణ మూవీస్‌ బ్యానర్లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పీరియాడిక్ లవ్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో 'బుట్ట బొమ్మ' పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. 'సాహో' వంటి భారీ చిత్రం తరువాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌ లో నెలకొన్నాయి. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నెలకొనియున్న పరిస్థితుల వలన చిత్రీకరణ ఆపేసుకుంది. పాన్ ఇండియా మూవీ కావడంతో పలువురు ఇతర ఇండస్ట్రీ నటులు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ తో సెట్స్ లో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ పంచుకున్న భాగ్యశ్రీ పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు. అందరిలాగే ప్రభాస్ మంచి తనానికి భాగ్యశ్రీ కూడా ఫిధా అయిపోయారు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావడంతో భాగ్యశ్రీ మొదట బయపడ్డారట. అయితే ప్రభాస్ ఫ్రెండ్లీ బిహేవియర్ తో ఆ భయం పోయిందట. ప్రభాస్ అంత పెద్ద స్టార్ హీరో అయినా అలా ఒదిగి ఉండడం ఆమెకు బాగా నచ్చిందట. అంతేకాకుండా వీరిద్దరూ ఫుడ్ లవర్స్ కావడంతో ఫుడ్ కి సంబందించిన అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారట. అయితే ఈ సినిమాలో ఆమె రోల్ ఏమిటనే విషయాన్ని మాత్రం భాగ్యశ్రీ బయటపెట్టలేదట.

ఇదిలా ఉండగా ఇంకా పేరు ఖరారు చేయని ఈ చిత్రానికి 'ఓ డియర్' 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ రెండు గెటప్స్ లో కనిపిస్తారని.. పీరియాడిక్‌ నేపథ్యంలో వచ్చే ఓల్డ్ గెటప్ లో.. అదేవిదంగా ప్రస్తుత కాలానికి సంబంధించి మరో గెటప్ లో ప్రభాస్ కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ అంనౌన్సమెంట్స్ ఉగాది కానుకగా ఇవ్వాలని చిత్ర యూనిట్ భావించారు. కానీ దేశ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన వాయిదా వేసుకున్నారు. అయితే రాబోయే రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా టైటిల్ ప్రకటించే అవకాశం ఉందని అనుకుంటున్నారు.
Tags:    

Similar News