డే 1 ను తలపించిన డే 5.. సరికొత్త రికార్డు

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కు లక్ కలిసి వచ్చింది. విడుదల అయిన మొదటి రోజు భారీగా వసూళ్లు రాబట్టింది. ఆవెంటనే వీకెండ్ అవ్వడంతో రెండవ రోజు మరియు మూడవ రోజు అయిన శని ఆదివారాల్లో భారీగా వసూళ్లు నమోదు అయ్యాయి. ఇక నాల్గవ రోజు సోమవారం అవ్వడంతో కాస్త వసూళ్లు డల్ గా అనిపించినా కూడా ఫస్ట్ షో మరియు సెకండ్ షో లకు భారీగా ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది.
సాదారణంగా అయితే నాల్గవ రోజు అంటే సోమవారం నుండి వసూళ్లు తగ్గడం జరుగుతుంది. కాని అనూహ్యంగా డే 5 కి మళ్లీ డే1 ని తలపించేలా థియేటర్ల వద్ద సందడి వాతావరణం కనిపించింది. భీమ్లా నాయక్ సినిమా డే 5 న మిడ్ నైట్ స్పెషల్ షో లు వేశారు. శివ రాత్రి స్పెషల్ గా భీమ్లా నాయక్ ను చూపించేందుకు ఎగ్జిబ్యూటర్లు మిడ్ నైట్ షో గా ప్రదర్శించడంతో అభిమానులు తగ్గేదే లే అంటూ శివరాత్రి జాగారంను భీమ్లా నాయక్ తో కలిసి చేయడం జరిగింది.
భీమ్లా నాయక్ సినిమా డే 5 రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా ఏడు కోట్ల వరకు షేర్ రాబట్టింది. అంతుకు ముందు రోజు నాలుగు కోట్లు కూడా దక్కలేదు. కాని శివ రాత్రి కారణంగా ఏకంగా ఏడు కోట్ల వరకు దక్కింది. మొదటి రోజు ఎలా అయతే పేపర్లు చల్లుతూ అభిమానులు సందడి చేశారో.. డే 5 రోజు శివ రాత్రి అర్ధరాత్రి షో లను కూడా అదే స్థాయిలో ఎంజాయ్ చేశారు.
అయిదవ రోజు ఏ సినిమాకు కూడా ఈ స్థాయిలో ఆధరణ దక్కలేదు. ఇప్పటి వరకు పవన్ నటించిన ఏ సినిమా కూడా ఈ స్థాయిలో ఓపెనింగ్స్ ను దక్కించుకోలేదు. మళ్లీ రెండు మూడు రోజుల్లో వీకెండ్ వస్తుంది కనుక అప్పుడు మళ్లీ సినిమా కుమ్మేస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్ల వరకు షేర్ వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాల సమాచారం.
ఏపీలో టికెట్ల రేట్లు తక్కువ ఉన్నా కూడా అభిమానుల ఉత్సాహంతో భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. అక్కడ అభిమానులు టికెట్ల రేట్లు తక్కువగా ఉండటంతో మళ్లీ మళ్లీ చూస్తున్నారా అన్నట్లుగా వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఇక యూఎస్ లో రెండు మిలియన్ డాలర్ల వసూళ్లతో భీమ్లా నాయక్ కుమ్మేస్తున్నాడు. నిత్యామీనన్ ఈ సినిమా లో పవన్ కు జోడీగా నటించగా కీలక పాత్రలో రానా నటించిన విషయం తెల్సిందే. త్రివిక్రమ్ రచన సహకారం అందించిన ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శశకత్వం వహించాడు.