ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా కొనసాగిన చాలా మంది నటీమణులు ప్రస్తుతం స్పెషల్ క్యారెక్టర్స్ తో మెప్పిస్తొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వారి వయసుకు తగ్గట్టు కొన్ని లీడ్ రోల్స్ పాత్రలను చేస్తున్నారు. అయితే చాలా వరకు అలాంటి పాత్రలు క్లిక్ అవుతున్నాయి. ఎక్కడో ఒకరిద్దరు తప్పితే అందరు వరుసగా ఆఫర్స్ ని అందుకుంటున్నారు. ఐదు పదుల వయసు దాటినా కూడా నటనతో మెప్పిస్తున్నారు.
శ్రీదేవి - మాధురి దీక్షిత్ వంటి నటీమణులు ఇప్పటికి సినిమాల్లో లీడ్ రోల్స్ లో కనిపిస్తున్నారు. కానీ కొందరు మాత్రం అమ్మ పాత్రలో అక్క పాత్రలో సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. స్టార్ హీరోయిన్ గా కొనసాగిన భూమిక కథానాయిక కథలకు వీడ్కోలు పలికి కొన్నేళ్లే అవుతోంది. అయినా అమ్మడు లీడ్ రోల్స్ కథలను చేయడం లేదు. రీసెంట్ గా ఎంసీఏ సినిమాలో వదిన రోల్ లో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే 50 ఏళ్లు ఉన్నవాళ్లే లీడ్ రోల్స్ సినిమాలను చేస్తున్నారు.
కానీ 39 ఏళ్ల భూమిక ఇలా ఎందుకు చేస్తోంది అని అడిగితే.. అసలు తాను వయసు బేధాన్ని ఏ మాత్రం లెక్కచేయను అంటోంది. కేవలం సినిమాకు నా పాత్ర ఎంత వరకు ఉపయోగపడుతుందో అంతే చూస్తాను. ఎదో అఫర్ వచ్చింది కదా అని ఏది పడితే అది చేయను. ముందు నాకు కథ నచ్చాలి. ఆ తర్వాత నా పాత్ర కూడా నాకు నచ్చాలి అని ఇతరులకు నచ్చే తరహాలో నాకు నచ్చిన సినిమాలను మాత్రమే చేస్తాను అని భూమిక తెలిపింది.