బిగ్ బ్రేకింగ్: రేపట్నుంచి థియేటర్లు బంద్..!

Update: 2021-04-20 13:19 GMT
కరోనా మహమ్మారి మళ్ళీ దేశవ్యాప్తంగా ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించారు. ఈ క్రమంలో తెలంగాణలో మరోసారి థియేటర్లు మూతపడనున్నాయి. వైరస్‌ ఉదృతి ఎక్కువగా ఉండటంతో రేపటి నుంచి థియేటర్లను మూసివేయాలని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఏకగీవ్ర నిర్ణయం తీసుకున్నారు.

ఏప్రిల్ 21 నుంచి 30వ తేది వరకూ సినిమా థియేటర్స్ మూసివేస్తున్నట్లు తెలంగాణ థియేటర్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. సినిమా థియేటర్ల నిర్వహణపై కార్యదర్శి విజేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలోఈరోజు మంగళవారం అసోసియేషన్‌ సభ్యులు సమావేశమయ్యారు. ఇది కరోనా ఉదృతి ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించి స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయమని విజేందర్‌ రెడ్డి తెలిపారు.

అయితే ఈ విషయంపై ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరపలేదని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. 'వకీల్‌ సాబ్‌' సినిమా ప్రదర్శించబడే థియేటర్లు మినహా అన్ని సినిమా హాళ్లు రేపు బుధవారం నుంచి మూసివేస్తున్నట్లు వెల్లడించారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైతం థియేటర్లలో ఆంక్షలు విధిస్తున్నారు. థియేటర్లలో ప్రతి రెండు సీట్ల మధ్య తప్పనిసరిగా ఒక సీటు ఖాళీగా ఉంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Tags:    

Similar News