ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ మాత్రమే కానీ ఇప్పడు ఆ పరిస్థితి మారింది. `బాహుబలి` తరువాత ఇండియన్ సినీ హిస్టరీలోనే విప్లవాత్మక మార్పులు మొదలయ్యాయి. చాలా వరకు బాలీవుడ్ నటీనటులు దక్షిణాది వైపు చూడటం మొదలు పెట్టారు. రావోయి చందమామ, ఇరువర్ (ఇద్దరు) , రక్షకుడు వంటి సినిమాలతో బాలీవుడ్ తారల తాకిడి మొదలైంది. అయితే అది `బాహుబలి` తరువాతే మరింతగా పెరిగింది.
బాయ్స్, సత్యం చిత్రాలతో జెనీలియా, టక్కరి దొంగ తో బిపాషా బసు, లీసారే, బద్రీతో అమీషా పటేల్ నుంచి స్నేహ ఉల్లాల్ వరకు దాదాపు 35 మంది బాలీవుడ్ భామలు తెలుగులో నటించారు. ఇప్పటికీ నటిస్తూనే వున్నారు. అయితే హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల పరంపర టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్ .. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన `RRR`తో తెలుగులో పరిచయమైన విషయం తెలిసిందే.
ఇక మరో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి .. యంగ్ హీరో వరుణ్ తేజ్ నటించిన `గని` మూవీలో నటించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళ రీమేక్ `లూసీఫర్` ఆధారంగా తెరకెక్కుతున్న `గాడ్ ఫాదర్`లోని ఓ కీలక అతిథి పాత్రలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు.
మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా వుంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ `ప్రాజెక్ట్ కె`లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, దిషా పటాని నటిస్తున్న విషయం తెలిసిందే.
వీరితో పాటు ఇదే ఏడాది మరో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తెలుగులో అరంగేట్రం చేశారు. యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ `కార్తికేయ 2`. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ మూవీ ద్వారా అత్యంత కీలకమైన దన్వంతరీ పాత్రలో నటించిన సినిమాకు కీలకంగా నిలిచారు. కనిపించింది అతిథి పాత్రలోనే అయినా సినిమాకు హైలైట్ గా నిలిచారు. బాలీవుడ్ లో అత్యంత బిజీఆర్టిస్ట్ గా వున్న అనుపమ్ ఖేర్ ఇటీవల `ది కశ్మీర్ ఫైల్స్` మూవీతో హాట్ టాపిక్ అయ్యారు. ఈ మూవీ నిర్మాత అభిషేక్ అగర్వాల్ కారణంగానే `కార్తికేయ 2`లో అనుపమ్ ఖేర్ నటించినట్టుగా తెలుస్తోంది.
ఈ మూవీ తరువాత తెలుగులో మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లకు అనుపమ్ ఖేర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రవితేజ హీరోగా నటిస్తున్న బయోపిక్ `టైగర్ నాగేశ్వరరావు`లో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారట. అంతే కాకుండా ప్రభాస్ - నాగ్ అశ్విన్ ల కలయికలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ `ప్రాజెక్ట్ కె`లోనూ పూర్తి నిడివి వున్న పాత్రలో కనిపించే అవకాశం వుందని తెలుస్తోంది.