సరైనోడు రీషూట్స్ పై టెన్షన్ వద్దు

Update: 2016-04-22 04:01 GMT
బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - రకుల్ ప్రీత్ సింగ్ - కేథరిన్ థ్రెసాలు హీరో హీరోయిన్లుగా నటించిన సరైనోడు.. రిలీజ్ ఇవాళే. ఈ మూవీపై అభిమానుల నుంచి ఇండస్ట్రీ వరకూ చాలానే అంచనాలు ఉన్నాయి.

'ఎక్కువకాలంగా వేధిస్తున్న దుర్మార్గుడిపై ఎవడైనా తిరగబడితే.. సరైనోడు వచ్చాడ్రా అనుకుంటాం.. అతడే నా హీరో' అంటున్నాడు దర్శకుడు బోయపాటి. ఊర మాస్ అని డైలాగ్స్ చెప్పించినా.. అందులోనూ బోలెడంత ఫ్యామిలీ రిలేషన్స్ తప్పనిసరిగా ఉంటాయన్నాడు. తాము మొదట కాపీ పంపినపుడు సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చిందని... మళ్లీ కొన్ని సీన్స్ డోస్ తగ్గించి రీషూట్ చేసి, యూ/ఏ తెచ్చుకున్నామన్న బోయపాటి.. వీటి క్వాలిటీ విషయంలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని అంటున్నాడు.

చాలామంది ఇది బన్నీ సినిమా ఉంటుందా, బోయపాటి సినిమాలా ఉంటుందా అని అడుగుతున్నారని.. సరైనోడు నూటికి నూరుపాళ్లు ఇది ప్రేక్షకుల సినిమాలా ఉంటుందని చెప్పాడు  బోయపాటి. ఇందుకు కారణం.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం రిజల్ట్ తేల్చే అసలైన సరైనోళ్లు ప్రేక్షకులే కదా అంటున్నాడు. 
Tags:    

Similar News