క‌ర్నాట‌క‌లో కామ్రేడ్ బాయ్ కాట్!

Update: 2019-07-26 13:10 GMT
ప్ర‌పంచ‌వ్యాప్తంగా నేడు `డియ‌ర్ కామ్రేడ్` అత్యంత భారీగా రిలీజైన సంగ‌తి తెలిసిందే. నాలుగు ద‌క్షిణాది రాష్ట్రాల్లో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక- మైత్రి బృందం అందుకు త‌గ్గ‌ట్టే విస్త్ర‌తంగా ప్ర‌చారం చేశారు. అదంతా అటుంచితే ఈ సినిమాని క‌ర్నాట‌క‌లో బ్యాన్ చేయాలంటూ స్థానికంగా వ్య‌తిరేక‌త నెల‌కొన‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. కర్ణాటక నుంచి ఇది ఊహించని షాక్. క‌న్న‌డ సినిమాల్ని డామినేట్ చేస్తున్న పొరుగు సినిమాల్ని అందునా ముఖ్యంగా తెలుగు సినిమాల్ని బ్యాన్ చేయవలసిందే అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ ప్ర‌భావం కామ్రేడ్ పై ప‌డుతోంది.

ఓవైపు త‌మిళం- మ‌ల‌యాళంలో `డియ‌ర్ కామ్రేడ్` రిలీజైనా అక్క‌డ లేని నిర‌స‌నలు క‌న్న‌డ‌లో వ్య‌క్తం అవుతున్నాయి. అయితే అందుకు కార‌ణ‌మేంటి? అంటే .. క‌ర్నాట‌క‌లో క‌న్న‌డ సినిమాల కంటే తెలుగు సినిమానే డామినేట్ చేస్తోంద‌న్న‌ది వారి ఆందోళ‌న‌. ఇరుగు పొరుగు డ‌బ్బింగ్ సినిమాల్ని ఇంత భారీ ఎత్తున రిలీజ్ చేస్తే క‌న్న‌డ సినిమా రంగం ఏమ‌వుతుంది? అంటూ స్థానికంగా ప‌లువురు వివాదాల్ని ఎగ‌దోస్తున్నార‌ని తెలుస్తోంది.

కన్నడంలో డ‌బ్ చేసిన వాటికి ఎక్కువ థియేటర్లు కేటాయించడాన్ని క‌న్న‌డిగ‌లు అవమానంగా భావిస్తున్నార‌ట‌. బెంగ‌ళూరులో క‌న్న‌డ సినిమాల్ని ఐదు థియేట‌ర్ల‌లో 8 షోల వ‌ర‌కే ప‌రిమితం చేస్తే.. అదే తెలుగు సినిమాలను 65 థియేటర్లలో 250 షోలు ప్రదర్శిస్తున్నార‌ని విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. అందుకే డియర్ కామ్రేడ్ చిత్రాన్ని చూడొద్దని సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌చారం సాగుతోంది. తమ మీద బలవంతంగా రుద్దే ప‌రాయి సినిమాల్ని ఇక‌పై సహించమని హెచ్చరిస్తున్నారు . ఈ రకమైన చిత్రాలను కర్ణాటక రాష్ట్రంలో అనుమతిస్తున్నందుకు కన్నడ చిత్ర పరిశ్రమపైనా దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే గ్లోబ‌లైజేష‌న్ లో ఎవ‌రు ఏ ఉత్ప‌త్తిని ఎక్క‌డ అయినా అమ్ముకోవ‌చ్చ‌న్న సూత్రాన్ని వీళ్లు వ్య‌తిరేకించ‌డం స‌రైన‌ది కాద‌ని విమ‌ర్శించే వాళ్లు ఉన్నారు. ముఖ్యంగా వినోదానికి ఇది వ‌ర్తించ‌దు. సినిమాకి అస‌లే వ‌ర్తించ‌దు. కానీ క‌న్న‌డిగులు వ్య‌తిరేకిస్తూనే ఉన్నారు.

    
    
    

Tags:    

Similar News