బ్రహ్మానందం పనైపోయింది.. బ్రహ్మానందం పనైపోయింది.. అంటూ ఏడాదిన్నరగా ఒకటే ప్రచారం. ముందు ప్రచారంలాగే అనిపించింది కానీ.. ఆ తర్వాత నిజంగానే బ్రహ్మి పనైపోతున్న సంకేతాలు కనిపించాయి. బ్రహ్మిని గతంలో అద్భుతంగా వాడుకున్న శ్రీను వైట్ల - త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ లు కూడా తమ చివరి సినిమాల్లో బ్రహ్మి క్యారెక్టర్ తో అంతగా నవ్వులు పండించారు. ముఖ్యంగా బ్రహ్మితో తన సినిమాలన్నింట్లో అద్భుతమైన కామెడీ పండించిన శ్రీను వైట్ల సైతం ‘ఆగడు’ సినిమాలో బ్రహ్మి పాత్రను తేల్చేశాడు. దీంతో ఇక ఈ కాంబినేషన్ వర్కవుట్ కాదన్న అభిప్రాయం ఇండస్ట్రీ జనాల్లో వచ్చేసింది.
వైట్ల కొత్త సినిమా ‘బ్రూస్ లీ’లో అసలు బ్రహ్మానందం లేనే లేడని.. బ్రహ్మి బదులు జయప్రకాష్ రెడ్డిని లీడ్ కమెడియన్ గా పెట్టుకున్నాడని ప్రచారం జరిగింది. ఐతే తీరా ట్రైలర్ చూస్తే అది అబద్ధమని తేలిపోయింది. ‘బ్రూస్ లీ’లో బ్రహ్మి ఉన్నాడు. శ్రీను మరోసారి బ్రహ్మికి స్పెషల్ క్యారెక్టర్ ఏదో డిజైన్ చేసినట్లే ఉన్నాడు. ట్రైలర్ లోనే ఈ పాత్రకు సంబంధించి ఇంట్రడక్షన్ కూడా ఇచ్చేశారు. బ్రహ్మి పాత్ర పేరు సుజుకి సుబ్రమణ్యం అలియాస్ పీటర్ అలియాస్ పకోడి అట. ఇన్ని అలియాస్ లు ఎందుకంటారా.. అతనో సీక్రెట్ ఏజెంట్ పాత్ర పోషిస్తున్నాడు. ఆఫ్ఘనిస్థాన్లో టెర్రరిస్టుని పట్టుకుంటానని బార్డర్ దాటెళ్లి బార్బర్ షాప్ పెట్టిన ఘనుడంటూ ఈ పాత్రను పరిచయం చేశారు ట్రైలర్ లో. బ్రహ్మి ఊపు చూస్తే ఈసారి వైట్ల, ఆయన కలిసి కొట్టేటట్లే కనిపిస్తోంది. మరి ఏమవుతుందో చూద్దాం.