టీమిండియా స్పీడ్ స్టర్ బుమ్రా - స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేషన్ ఒక్కటైన సంగతి తెలిసిందే. మార్చి 14న వీరి వివాహం వైభవంగా జరిగింది. అప్పటి వరకూ సీక్రెట్ గా లవ్ ట్రాక్ నడిపిన ఈ జంట.. ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.
ఆ తర్వాత ఇద్దరూ కలిసి సోషల్ మీడియా వేదికగా తమ పెళ్లి విషయాన్ని ప్రకటించారు. ‘‘ప్రేమికులుగా ఉన్న మేము కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాం. మా జీవితాల్లో సంతోషకరమైన రోజుల్లో ఇది ఒకటి. మా ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవడం ఆశీర్వాదంగా భావిస్తున్నాం. జస్ ప్రీత్ అండ్ సంజనా’’ అని ఇన్ స్టా లో పోస్ట్ చేశారు. అందరూ తథాస్తూ అని దీవించారు కూడా.
అయితే.. ఇప్పుడు స్పెషల్ ఏమంటే.. ఇవాళ (మే 6) సంజనా గణేషన్ పుట్టిన రోజు. భార్య పుట్టిన రోజు.. అందునా పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిన మొదటి బర్త్ డే. ఇక లవర్ కమ్ హజ్బెండ్ ఎలా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఈ ప్రపంచంలో ఆమె తప్ప ఇంకేదీ అక్కర్లేదన్నట్టుగా ఉంటాడు. ఆ విషయం చెప్పడానికి మాటలు కూడా సరిపోవు అంటాడు. ఇప్పుడు బుమ్రా కూడా అదే కండీషన్లో ఉన్నాడు.
ఫైనల్ గా.. తాను ఎంత ప్రేమిస్తున్నాడనే విషయం ఏదో విధంగా వ్యక్తం చేయాలి కాబట్టి.. సోషల్ మీడియాను ఎంచుకున్నాడు బుమ్రా. ఈ మేరకు భార్య అందమైన ఫొటోను షేర్ చేసి ఇలా కామెంట్ చేశాడు. ‘‘ప్రతి రోజూ నా మనసు దోచుకునే నా ప్రాణమా.. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు నా దానివి. ఐలవ్యూ’’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన వారంతా సంజనాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నేడు 30వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటోంది సంజనా.