ఈ మధ్య యూత్ సినిమాలు చాలానే వస్తున్నాయి కానీ వాటిలో కాలేజీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సాంగ్స్ బొత్తిగా లేకుండా పోయాయి. అప్పుడెప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం శివలో బోటనీ పాఠముంది తర్వాత ఆ స్థాయిలో అలరించే పాటలు అంతగా రాలేదు. ఆ స్థాయిలో పోల్చడం సరికాదు కానీ ఆ కొరత కొంతైనా తీర్చేందుకు వస్తున్నాడు కామ్రేడ్. ఇప్పటికే మూడు ఆడియో సింగిల్స్ తో ఆన్ లైన్ లో రచ్చ చేస్తున్న డియర్ కామ్రేడ్ లోని నాలుగో పాట ఇందాక వీడియోతో సహా రిలీజ్ చేయడం విశేషం.
జస్టిన్ ప్రభాకర్ క్యాచీ ట్యూన్ కి రెహమాన్ అందించిన లిరిక్స్ చాలా సింపుల్ గా క్యాచీగా ఉండటంతో యువతకు ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఉంది. కాలేజీ క్యాంటీను అంటేనే ప్రేమ పక్షులకు హెవెను వాళ్లకు టీ కాఫీలు అందించే స్టేషను అని చాలా రిథమిక్ గా కంపోజ్ చేసిన విధానం బాగుంది. రెగ్యులర్ గా అందరు వెళ్లే లిరికల్ వీడియోస్ టైపు లో కాకుండా ఏకంగా సగానికి పైగా వీడియో సాంగ్ ని మైత్రి సంస్థ రిలీజ్ చేయడం గమనార్హం.
సింపుల్ సెటప్ లో కాలెజ్ క్యాంటీన్ బ్యాక్ డ్రాప్ లో స్టూడెంట్స్ అంతా పాట పాడుకుంటూ ఉండగా మధ్యలో స్టైలిష్ గా బెల్ట్ కి షర్ట్ కి మధ్య టీ గ్లాస్ తో విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇప్పించి మంచి జోష్ ఇచ్చాడు దర్శకుడు భరత్ కమ్మ. రెగ్యులర్ గా కాకుండా చాలా న్యాచురల్ గా ఉండటం ట్యూన్ ప్రత్యేకత. స్టూడెంట్ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీగా రూపొందుతున్న డియర్ కామ్రేడ్ మీద ఇప్పుడీ పాటతో అంచనాలు ఇంకాస్త పెరగడం ఖాయమే
Full View