శంక‌ర్ ప్రాజెక్ట్ కోసం మేకోవ‌ర్ క‌స‌ర‌త్తులు

Update: 2021-10-30 10:30 GMT
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్.సి15 తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సినిమా ప్రారంభోత్స‌వం కూడా జ‌రిగింది. న‌వంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెళ్ల‌డానికి యూనిట్ రెడీ అవుతోంది. ఈ నేప‌థ్యంలో చ‌ర‌ణ్ లుక్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఇందులో చ‌ర‌ణ్ ఓ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు ఇప్ప‌టికే రివీల్ అయింది. ఒక యువ ఐఏఎస్ అదికారి రాజ‌కీయాల్లోకి వ‌స్తే వ్య‌వ‌స్థ‌లో వ‌చ్చిన మార్పులు ఏమిట‌న్న‌ది క‌థ‌.

ఐఏఎస్ ట‌ర్న్ డ్ పొలిటీషియ‌న్ పాత్ర‌లో చ‌ర‌ణ్ క‌నిపించ‌బోతున్నాడు. శంక‌ర్ మార్క్ తో `భార‌తీయుడు` రేంజ్ లో ఉంటుంద‌ని ఊహాగానాలున్నాయి. శంక‌ర్ హీరో అంటేనే ఊహ‌కంద‌ని విధంగా ఉంటాడు. ర‌క‌ర‌కాల గెట‌ప్పుల్లో అద‌ర‌గొట్ట‌డం ఖాయం. ఈ నేప‌థ్యంలో చ‌ర‌ణ్ లుక్ ఎలా ఉంటుంద‌న్న దానిపై ఇప్ప‌టికే ఆస‌క్తి నెల‌కొంది. త‌న కెరీర్ బెస్ట్ అని భావిస్తున్న ఈ మూవీ కోసం చ‌ర‌ణ్ గ‌ట్టిగానే శ్ర‌మిస్తున్న‌ట్లు తెలుస్తోంది. జిమ్ములో క‌స‌ర‌త్తులు చేస్తూ భారీగా శ‌రీర సౌష్ట‌వంలో మార్పులు తీసుకొస్తున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. జిమ్ లో వ‌ర్క‌వుట్లు చేస్తూ మ‌ధ్య‌లో విశ్రాంతి స‌మ‌యంలో చ‌ర‌ణ్ దిగిన ఓ ఫోటో ఇప్పుడు ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది.

చ‌ర‌ణ్.. యాబ్స్ ని టోన‌ప్ చేస్తూ కండ‌లు భారీగా పెంచే ప‌నిలో ఉన్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ఇది సినిమాపై ఆస‌క్తిని పెంచుతుంది. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా జిమ్ లో వ‌ర్కౌట్లు చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఇప్ప‌టికే పూణేలో కియ‌రా అద్వాణీ స‌హా కీల‌క న‌టుల‌పై చిత్రీక‌ర‌ణ సాగింది. త‌దుప‌రి కీల‌క షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. 2022 మోస్ట్ అవైటెడ్ మూవీగా ఆర్.సి 15 చ‌రిత్ర సృష్టిస్తుంద‌ని మెగాభిమానులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.


Tags:    

Similar News