సినిమా నటులన్నాక రకరకాల కోరికలు ఉండడం కామన్. అలాంటి రోల్ చేయాలని, ఫలానా అవార్డు అందుకోవాలని టార్గెట్స్ ఉండడం సహజం. సీనియర్ భామ ఛార్మీ.. చాలా సినిమాల్లో రకరకాల పాత్రలు పోషించింది. అయితే, ఎన్ని రకాల రోల్స్ వేసినా.. తనకి ఓ కోరిక మాత్రం నెరవేరలేదని ఫీల్ అవుతోంది. ఆ కోరిక నెరవేర్చుకోవడానికి ఎంత డేర్ అయినా చేస్తానని కూడా చెబుతోంది ఛార్మీ.
ఒకే సినిమాలో పది రకాల పాత్రలు చేయడమే ఛార్మీ తీరని కోరిక. అదేమంటే.. 'దశావతారంలో కమల్ హాసన్ పది పాత్రలు చేశారు, నట్టీ ప్రొఫెసర్ లో ఎడ్డీ మర్ఫీ ఏడు రోల్స్ చేశాడు. ఎవరైనా నిర్మాత నాకు గానీ అలాంటి ఛాన్స్ ఇస్తే, ఫ్రీగా నటించేస్తా. ఒకవేళ ఎవరూ ముందుకు రాకపోతే అలాంటి సినిమా నేనే తీసేస్తా' అంటోంది ఛార్మి. నిర్మాతగాను ఈ మధ్య అనుభవం సంపాదించడంతో ఛార్మీకి ధైర్యం పెరిగిపోయింది లెండి. అదీ సంగతి. అయితే ఇక్కడితే ఈ కోరికల చిట్టా అయిపోలేదు.
మళ్లీ జన్మంటూ ఉంటే మాత్రం.. ఐశ్వర్యా రాయ్ కళ్ళు - జెన్నిఫర్ లొపేజ్ ఫిగర్ - జూహీ చావ్లా నవ్వు - బాబీలీ డింపుల్ కపాడియా యాక్టింగ్ ట్యాలెంట్ - కృష్ణవంశీ లాంటి బ్రెయిన్ తో పుట్టాలని కోరుకుంటుందట. అంతే కాదు.. ఆ జనమ్మలో షారూక్ ఖాన్ లాంటి బాయ్ ఫ్రెండ్ ఉండాలనే కండిషన్ కూడా ఇక్కడ అప్లై అవుతుంది. ఈ లిస్ట్ వింటుంటే.. వచ్చే జన్మ కాదు.. ఏ జన్మలోనూ తీరని కోరికే ఇది అనిపిస్తోంది కదూ.