సినిమా హీరోయిన్లు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఓ 2-3 ఏళ్లు గడిచిన దగ్గర నుంచి.. వాళ్లకు ఎక్కువగా ఎదురయ్యే ప్రశ్న.. 'పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?' అనే. పాపం.. తమ పెళ్లి గురించి వారు కూడా అంతగా ఆలోచించరు కానీ.. మీడియా జనాలు మాత్రం హీరోయిన్ల పెళ్లి కబుర్లను చెప్పేందుకు.. ఏమీ లేకపోతే అప్పటికప్పుడు వండేసేందుకు తెగ ఉత్సాహం చూపిస్తుంటారు.
రీసెంట్ గా ఛార్మి కూడా ఇలాగే కాసిన్ని పెళ్లి కబుర్లు చెప్పుకొచ్చింది. కానీ ఈమె వెర్షన్ వింటే షాక్ తినక తప్పదు. అసలు తనకు పెళ్లిపై నమ్మకమే లేదని అంటోంది ఛార్మి. పైగా ఇందుకు రెండు కారణాలను కూడా చూపిస్తోంది. ఎవరో ఒక కొత్త వ్యక్తి తన జీవితంలోకి వచ్చేసి.. ఇప్పుడు తను చేస్తున్నదాని గురించి ప్రశ్నించడం.. నిలదీయడం వంటివాటిని అస్సలు తట్టుకోలేదట ఛార్మి కౌర్. 'నేను ఎక్కువగా సినిమా లోకంలోనే గడుపుతాను. ఫ్రెండ్స్ తో వెకేషన్స్ కు వెళుతుంటాను. సో.. ఎక్కువగా అందుబాటులో ఉండే అవకాశం ఏ మాత్రం లేదు. రెండోది గారాబం చేయడం.. ఇది కొన్నాళ్లు మాత్రమే ఉంటుందనే విషయంలో ఇప్పటికే క్లారిటీ వ్చచేసింది' అంటోంది ఛార్మీ.
గతంలో ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉన్నానని చెప్పిన ఈమె.. ఇప్పుడు పూర్తిగా కట్ అయిపోయినట్లు చెప్పింది. అయితే.. అతను మాత్రం చాలా మంచివాడని సర్టిఫికేట్ ఇచ్చేస్తుండడం విశేషం. తప్పంతా తనదే అంటున్న ఛార్మి.. తను అసలు 'మ్యారేజ్ మెటీరియల్'ని కాదు అంటూ పెద్ద మాటే అనేసింది.