'శ్రీమంతుడు' పాటలు యూత్ లో ఫీవర్ రాజేస్తున్నాయి. వైరస్ లా నరనరాల్లో కి ఎక్కేస్తున్నాయి. ఆల్బమ్ లో ప్రతి పాటా దేనిక దే ప్రత్యేకం. ఈ ఆల్బమ్ తో దేవీ లైమ్ లైట్ లోకి వచ్చేసినట్టే. అప్పుడు గబ్బర్ సింగ్ ఆల్బమ్ తో ఎంత ఫైర్ చూపించాడో మరోసారి ఆ రేంజు లో ఫైర్ చూపించాడు. పూర్తి క్లాసిక్ టచ్ తో సాగిన పాటలు వేటికవే ప్రత్యేకం అన్న పేరు తెచ్చుకున్నాయి. ముఖ్యంగా మొన్న ఆడియో తో పాటు రిలీజ్ చేసిన టీజర్ లో 'చారు శీల' విజువల్లీ, టెక్నికల్లీ బ్లాస్ట్ అనిపించింది.
ఇందులో శ్రుతిహాసన్ లుక్ హైలైట్. 'ధూమ్ 2'లో ఐశ్వర్యారాయ్‌ని కొట్టే రేంజులో కనిపించింది. ప్రిన్స్ గెటప్స్, క్లాసిక్ స్టెప్స్ చూపుల్ని తిప్పుకోనివ్వని స్పీడ్ హైలైట్. విజువల్ కి తగ్గట్టే సాహిత్యం లో గ్లింప్స్ మతి చెదరగొట్టింది. బ్లూమ్యాట్ ఫార్మాట్ లో, గ్రీన్ మ్యాట్ ఫార్మాట్ లో బ్యాక్ గ్రౌండ్ అద్భుతంగా డిజైన్ చేశారు ఈ పాట కోసం. అంతర్జాతీయ స్టాండార్డ్స్ లో విఎఫ్ఎక్స్ వర్క్ అత్యద్భుతం అనిపించింది. ఖరీదైన విజువల్స్ మైండ్ బ్లోవింగ్. చారుశీల యువతరం గుండెకు మరమ్మత్తు లాంటిది. చూసే కళ్లకు పండగ లాంటిది అంటే అతిశయోక్తి కాదు.