చిరు లెక్కలో లేని బ్రూస్ లీ?

Update: 2015-10-03 04:05 GMT
బ్రూస్ లీ ది ఫైటర్ లో చిరంజీవి గెస్ట్ కేరక్టర్ చేస్తున్నారు. ఓ మూడు నిమిషాలు ఈ పాత్ర ఉంటుంది. ఓ ఫైట్ చేసి, ఓ డైలాగ్ చెప్పి వెళ్లిపోతారు. నాకోసం చాలామంది వెయిటింగ్, వెళ్లాలి బై అంటానని.. ఆయనే చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ.. చిరంజీవి లెక్కలో ఈ సినిమా లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది.

150వ సినిమా ఉంటుంది. ఈ సారి కథ దొరకలేదని అని చెప్పడంలేదు, బ్రూస్ లీ రిలీజ్ టైంకి.. నిర్మాతలైన రామ్ చరణ్ - సురేఖలు డీటైల్స్ చెప్తారంటూ ఊరించి వదిలేశారు మెగాస్టార్. ఇంతకీ అసలు బ్రూస్ లీ లో తాను చేయాలని అనుకోలేదని, రీఎంట్రీకి ముందు టీజర్ లా ఓ పాత్ర చేయాలని కోరితే.. ఒప్పుకున్నానంటూ ఆశ్చర్యంలో ముంచెత్తేశారాయన. అంటే బలవంతంగా ఒప్పించారని అనిపిస్తోంది.

మెగాస్టార్ మాటలను బట్టి చూస్తే.. బ్రూస్ లీలో చేసినది ఉత్తుత్తి పాత్ర మాత్రమే.. 150 వ సినిమా లెక్క దానిదే అన్నట్టుగా ఉంది.  అలా ఎలా మాస్టారూ ? గెస్ట్ గా కనిపించినంత మాత్రాన లెక్క పెట్టనంటే ఎలా ? ఇంతకు ముందు 3 సార్లు మెరిసినపుడు లెక్కపెట్టారుగా ? ఇప్పుడు బ్రూస్ లీ ని లెక్కేయద్దంటే ఎలాగండీ..

150వ సినిమా అంటే.. కాస్త ఎమోషనల్ టచ్ అనిపిస్తుంది. అదే 151 అంటే.. మామూలు అంకేగా అనుకోవచ్చు ఫ్యాన్స్. చిరు కూడా ఈ అంకెకి బాగానే కనెక్ట్ అయినట్లున్నారు. అందుకే.. నా లెక్క నాదే అంటూ.. బ్రూస్ లీని కౌంట్ లోంచి తీసేసినట్లున్నారు.
Tags:    

Similar News