ముంబైలో మెగాస్టార్ కి సర్జరీ??

Update: 2016-02-03 12:25 GMT
మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కీలక నేత అనే విషయం మనకు తెలిసిందే. కానీ ఈ మధ్య ఆయన కాంగ్రెస్ చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గత పది రోజుల్లో మూడు సార్లు తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలు చేశారు. రెండు సార్లు హైద్రాబాద్ కు, మరోసారి అనంతపురం జిల్లాకు వచ్చారు రాహుల్. కానీ ఎక్కడా మెగాస్టార్ మాత్రం కనిపించలేదు. దీంతో పార్టీకి, చిరంజీవికి మధ్య దూరం పెరిగిందని చాలా మంది అనుకుంటున్నారు.

అయితే ఇందులో వాస్తవం లేదని, ఇంకా ఆయన కాంగ్రెస్ లీడరేనని అని సన్నిహితులు అంటున్నారు. కానీ ఇప్పుడు రాహుల్ పర్యటనలకు చిరు రాకపోవడానికి కారణం.. ప్రస్తుతం మెగాస్టార్ కి ఆరోగ్యం సరిగా లేకపోవడమేనట. నిజానికి చిరు ఇప్పుడు హైద్రాబాద్ లో కూడా లేడని అంటున్నారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని చెప్పుకుంటున్నారు. భుజానికి సర్జరీ చేయించుకునేందుకు ఇలా హాస్పిటల్ లో చేరారట చిరు.

మెగాస్టార్ కి సర్జరీ అనే వార్తలు రాగానే అభిమానుల్లో గుబులు మొదలైంది. సోషల్ సైట్లలో మెగా సర్జరీ న్యూస్ శరవేగంగా తిరిగేస్తోంది. అయితే, ఇందులో వాస్తవం ఎంత అనే విషయం మాత్రం మెగా ఫ్యామినీ నుంచి కన్ఫర్మేషన్ రాలేదు. ఇప్పటికే చిరంజీవి 150వ చిత్రం స్టోరీ రైట్స్ వివాదంతో వాయిదా పడ్డంతో దిగులు పడ్డ మెగా ఫ్యాన్స్.. ఇప్పుడు చిరుకు ఆపరేషన్ అన్న సంగతి తెలిసి మరింతగా వర్రీ అవుతున్నారు.
Tags:    

Similar News