చిరంజీవి.. టాలీవుడ్ లో స్వయం కృషితో ఎదిగారు. ఆయన పేరు చెబితేనే ఇండస్ట్రీలో ఒక రకమైన మంచి గుర్తింపు ఉంది. ఇక సినిమాల పరంగా ఆయన ట్రాక్ రికార్డు మాములుగా లేదు.. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వెండితెర మెగా స్టార్ గా చిరంజీవి ఎదగడంలో ఆయన కృషి ఎంతో ఉంది. అందుకే ఇప్పుడు టాలీవుడ్ లో బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగే ఎంతో మంది హీరోలకు చిరు ఆదర్శం. అందరూ చిరంజీవిని అనుకరిస్తారు. కానీ ఫస్ట్ టైం.. చిరంజీవి ఒక హీరోను అనుకరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ హీరో మరెవరో కాదు.. మన విజయ్ దేవరకొండ..
విజయ్ దేవరకొండ తాజాగా నటించిన ‘గీతాగోవిందం’ మూవీ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది. ఈ సినిమా సమర్పకులు అల్లు అరవింద్ ఆదివారం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఫంక్షన్ లో చిరంజీవి ఏకంగా అర్జున్ రెడ్డి మూవీలో విజయ్ డైలాగులను చెప్పి అతడిని అనుకరించడం అందరినీ ఆశ్చర్యపరించింది. చిరు డైలాగ్ కు ఫంక్షన్ కు వచ్చిన ప్రేక్షకులంతా ఉర్రూత లూగిపోయారు.
చిరంజీవి మాట్లాడుతూ అర్జున్ రెడ్డిలోని ఫేమస్ డైలాగ్ చెప్పుకొచ్చాడు. ‘ఏం మాట్లాడుతున్నావ్ రా..’ డైలాగ్ ను చిరంజీవి అనుకరించాడు. ఆ తర్వాత వచ్చే బూతు మాటను తాను చెప్పకూడదని అన్నారు.
ఇక పెళ్లి చూపులు సినిమాలో సాధారణ కుర్రాడిగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత అర్జున్ రెడ్డితో ఆశ్చర్యపరిచాడని.. ఆ పాత్రను అద్భుతంగా పోషించాడని చిరంజీవి ప్రశంసించారు. ఇప్పుడు గీతా గోవిందంతో తనలోని కొత్త కోణాన్ని చూపించాడని చిరు తెలిపాడు. అర్జున్ రెడ్డి మూవీ కేవలం యూత్ కు కనెక్ట్ అయ్యింది. కానీ గీతాగోవిందం అన్ని వర్గాలు - ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకు చేరువ అయ్యిందని చిరు తెలిపాడు. తనకు గీతాగోవిందం చూస్తుంటే తన ‘విజేత’ మూవీ గుర్తుకొచ్చిందని వివరించాడు. గీతాగోవిందం మూవీ విజయ్ కు స్టార్ స్టేటస్ తెచ్చిందని.. ఇది అతడి సినిమా కెరీర్ కే మైలురాయి అని కొనియాడారు. టాలీవుడ్ లో విజయ్ కు మంచి భవిష్యత్తు ఉందని చిరు ప్రశంసించాడు.