తాజాగా టీఎస్సార్ అవార్డ్స్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగిందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. సుబ్బిరామిరెడ్డి పేరిట జరిగే కార్యక్రమం కావడంతో.. ఆహ్వానం అందిన ప్రతీ ఒక్కరూ కనిపించారు. అవార్డులు గెలుచుకునే వాళ్లే కాదు.. ఇండస్ట్రీ ప్రముఖులంతా రావడానికి కారణం.. టీఎస్సార్ అనడంలో సందేహం లేదు. అలాగని లోపాలేమీ లేవా అంటే చాలానే మాటలు వినిపిస్తాయ్.
హైద్రాబాద్ లో ఇలాంటి అవార్డు ఈవెంట్స్ ఏవైనా జరిగితే.. అవన్నీ చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటాయి. ఆహుతులను సిటీకి రప్పించడమే కాదు.. ఫంక్షన్ ఏర్పాటు.. స్టేజ్ నిర్వహణ.. స్టేట్ పైకి పిలవడం అంతా ఓ షెడ్యూల్ అండ్ ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది. కానీ విశాఖలో జరిగిన టీఎస్సార్ అవార్డుల వేడుకలో మాత్రం.. స్టేజ్ పై కూడా రసాభాస కనిపించింది. సుబ్బిరామిరెడ్డి అప్పటికప్పుడు స్టేజ్ మీదకు గెస్టులను ఆహ్వానించడం.. కొంత గందరగోళంతో పాటు.. ఆర్గనైజర్లకు చెమటలు పట్టించేసింది. నిజానికి ఇలాంటి కార్యక్రమాల్లో స్టార్స్ ఎవరూ మొదటి నుంచి చివరి వరకూ ఉండరు. అలాగే ఓ పెద్ద స్టార్ ని గంట ఉంటే చాలని పిలిచారట. కానీ అక్కడ మాత్రం షెడ్యూల్ ప్రకారం కాకుండా వేడుక నిర్వహించడంతో .. రెండున్నర గంటల పాటు ఉండిపోవాల్సి వచ్చిందట.
ఆ దెబ్బకు ఆయన ఫ్లయిట్ మిస్ అయిపోయి.. తెల్లారక కానీ విశాఖ నుంచి బయల్దేరలేకపోయారని తెలుస్తోంది. విశాఖను ఏపీకి సినిమా హబ్ గా మార్చేందుకు.. ఈ వేడుకను ఇక్కడు నిర్వహించాలనే సుబ్బిరామి రెడ్డి ఆలోచన అద్భుతమే అయినా.. ఇప్పటివరకూ ఈ నగరంలో ఇలాంటివి జరుగని అనుభవ రాహిత్యం ప్రత్యక్షంగా కనిపించింది. తర్వాత జరిగే ఈవెంట్ లో అయినా ఇలాంటివి లేకుండా సాఫీగా జరగాలని కోరుకుందాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/