తెలుగు లో బొమ్మరిల్లు మరియు నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో హీరోగా స్టార్ డమ్ దక్కించుకున్న సిద్దార్థ్ దాదాపుగా దశాబ్ద కాలం పాటు తెలుగు లో మంచి స్టార్ గా పేరు దక్కించుకుని సినిమాలు చేశాడు. కాని కాల క్రమేనా ఆయన వరుసగా ప్లాప్ లు చవి చూస్తూ వచ్చాడు. దాంతో తెలుగు లో ఆయనకు సినిమాల ఆఫర్లు తగ్గడం మొదలు అయ్యింది. ఒకానొక సమయంలో ఆయనకు తెలుగు లో సినిమాలు పూర్తిగా నిలిచి పోయాయి.
ఇప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తున్నా కూడా ఆయన అంటే అభిమానం ఉన్న వారు ఇంకా ఆయన నుండి మంచి సినిమాలు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో సిద్దార్థ్ మెల్ల మెల్లగా కమర్షియల్ సినిమాలు కాకుండా మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాల దారిన పడుతున్నాడు. హీరోగా ఆయన సినిమాలు మరియు ఆయన సోషల్ మీడియా పోస్ట్ లు ఎప్పుడు కూడా వార్తల్లో ఉండేలా చేస్తున్నాయి.
రాజకీయాల గురించి ఆయన చేసే పోస్ట్ లు ఈమద్య కాలంలో వివాదాస్పదం అవుతున్నాయి. ఏకంగా క్షమాపణ చెప్పే వరకు ఆయన వెళ్లాడు. ఇప్పుడు ఆయన హీరోగా ఒక సినిమా రూపొందుతుంది. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. సొంత నిర్వాణంలో సిద్దు ఆ సినిమాను నిర్మించబోతున్నాడు. సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకుండా సింపుల్ గా ఒక పోస్టర్ ను విడుదల చేశాడు.
ఆ పోస్టర్ లో ఒక వ్యక్తి పాపను పట్టుకుని వెళ్తున్నాడు. అతడు బుజానికి బ్యాగ్ వేసుకుని ఉన్నాడు. మరో చేతిలో ఇంకా రెండు బ్యాగ్ లు ఉన్నాయి. పోస్టర్ కాన్సెప్ట్ చాలా విభిన్నంగా ఉంది. అతడు పాపను పట్టుకున్న చేతికి బేడీలు ఉండటంతో మరింత ఆసక్తి రేకెత్తుతోంది. ఒక సాదారణ గ్రామంలో అది కూడా పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని ఈ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటే అర్థం అవుతుంది.
ఈమద్య కాలంలో ఒక్క భాష లో సినిమాలు రావడం తక్కువ అయ్యాయి. అందుకే ఈ సినిమాను కూడా తమిళంతో పాటు తెలుగు మరియు మలయాళంలో కూడా తెరకెక్కిస్తున్నట్లుగా ప్రకటించాడు. హీరోగా సిద్దు చేస్తున్న సినిమాలు బ్యాక్ టు బ్యాక్ అన్నట్లుగా కాకుండా ఆచి తూచి చేస్తున్నాడు.
కనుక ఈ సినిమా తప్పకుండా ఆయనకు మంచి విజయాన్ని తెచ్చి పెడుతుందేమో చూడాలి. ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు.. ఇతర సాంకేతిక నిపుణులు ఎవరు అనేది త్వరలోనే వెళ్లడి అయ్యే అవకాశం ఉంది.