మలయాళీ బ్లాక్ బస్టర్ ప్రేమమ్ ను తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించినప్పటి నుంచి.. బోలెడన్ని విమర్శలు వచ్చేశాయి. నాగ చైతన్య.. శృతి హాసన్ లపై అయితే లెక్కలేనంత ట్రాలింగ్ జరిగింది. ఎవరే సాంగ్ ను అయితే.. దక్షిణాది జనాలు చాలామంది ఏకి పడేశారు. అసలు ప్రేమమ్ ను రీమేక్ చేయడమే పెద్ద తప్పని.. క్లాసిక్ ని చెడగొట్టేస్తున్నారనే కామెంట్స్ వినిపించాయి.
ఈ దెబ్బకి ఎవరే సాంగ్ కి కామెంట్స్ ఆఫ్ చేయాల్సి వచ్చింది తెలుగు వెర్షన్ నిర్మాతలకు. ఇప్పుడు తెలుగు ప్రేమమ్ రిలీజ్ అయింది. తమపై వచ్చి మొత్తం విమర్శలకు తమ యాక్టింగ్ తోనే సమాధానం ఇచ్చారు నాగ చైతన్య-శృతి హాసన్. ఒరిజినల్ మూవీలా క్లాసిక్ గా మలచాలనే ప్రయత్నం చేయకపోవడం.. తెలుగు ప్రేమమ్ కు స్పెషల్ అడ్వాంటేజ్ కాగా.. చైతు-శృతిల పెర్ఫామెన్స్ కు మలయాళీ ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు వస్తున్నాయి.
ఇన్ని నెలలుగా తమపై వచ్చిన విమర్శలపై సైలెంట్ గా ఉన్న ఈ జంట.. ఇప్పుడు విమర్శలన్నిటినీ తమ ప్రతిభతోనే తిప్పికొట్టడాన్ని ప్రత్యేకించి చెప్పుకోవాలి. తాము చేసే రీమేక్ లోనూ కంటెంట్ ఉందని తాము నమ్మడమే కాకుండా.. క్రిటిక్స్ ని ఒప్పించిన మెప్పించిన ప్రేమమ్ యూనిట్ ని అభినందించాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/