కొత్త కొత్త ప్రమోషన్ ఐడియాలతో మన టాలీవుడ్లో ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నారు. అసలు ఆడియో ఫంక్షన్లను చేయడం మానేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ మెగా ఫ్యామిలీ తెరలేపితే.. అసలు ఆడియో ఫంక్షన్లో ఆడియో సిడి కూడా సినిమా తొలి టిక్కెట్ లాంచ్ చేస్తున్నాం అంటూ మొన్న 'నిన్నుకోరి' ఆడియోలో నాని తెరలేపాడు. దర్శకుడు రాజమౌళి చేత తొలి టిక్కెట్ ను లాంచ్ చేయించారు.
ఇప్పుడు ఇదే ఐడియాను మరి కాస్త ముందుకు తీసుకెళ్ళిన సుకుమార్.. ఆల్రెడీ సెలబ్రిటీలతో తన ''దర్శకుడు'' సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు కాబట్టి.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఈ సినిమా టిక్కెట్టును కొనిపించారు. ఈ సినిమా మొదటి టిక్కెట్టును కొనుక్కున్న చిరంజీవి.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. తన అన్నయ్య కొడుకు అశోక్ బండ్రెడ్డిని హీరోగా లాంచ్ చేస్తున్న సుకుమార్.. మొత్తానికి చిరంజీవి.. రామ్ చరణ్.. అల్లు అర్జున్.. ఇలా మెగా ఫ్యామిలీలో ఎవ్వరినీ వదలిపెట్టకుండా గట్టిగానే ప్రమోట్ చేయించుకుంటున్నాడు. వీరే కాకుండా ఎన్టీఆర్.. రకుల్ ప్రీత్.. సమంత కూడా ఈ సినిమాను ప్రమోట్ చేశారు.
ఆగస్టు 4న విడుదల కానున్న దర్శకుడు సినిమాను హరిప్రసాద్ జక్క డైరక్షన్లో రూపొందించారు. చాలా సినిమాలకు సుకుమార్ కు రైటింగ్ లో సహకారం అందించిన హరిప్రసాద్ ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి. గతంలో సుకుమార్ కు మాటలు స్ర్కీన్ ప్లే రాసిన వేమారెడ్డి కూడా.. చక్కిలిగింత అనే సినిమాను డైరక్ట్ చేసి నిరాశపరిచిన సంగతి తెలిసిందే.