నిండు చందురుడు ఒకవైపు.. చుక్కలు ఒకవైపు అంటూ ఓ పాట ఉంటుంది. దర్శక రత్న దాసరి నారాయణరావుకు ఈ పాట చాలా బాగా సూటవుతుంది. తెలుగు సినీ చరిత్రలో ఆయన ఆయనొక్కడు ఒకవైపు.. మిగతా వాళ్లందరూ ఒకవైపు. ఇదేదో మాట వరసకు అనుకునే మాట కాదు. ఇది అక్షరసత్యం. దాసరి ఇప్పుడు లేరు కాబట్టి ఈ పొగడ్తలు మామూలే అనిపించొచ్చు. కానీ ఆయన ఉన్నా కూడా ఈ మాటను అంగీకరించి తీరాల్సిందే. తెలుగు సినిమాలో ఆయనది అంతటి ప్రత్యేక ప్రస్థానం.
తెలుగులో ఎంతోమంది గొప్ప దర్శకులున్నారు. కె.వి.రెడ్డి.. బి.ఎన్.రెడ్డి.. ఆదుర్తి సుబ్బారావు.. కమలాకర కామేశ్వరరావు.. ఇలా చాలామంది దిగ్గజాలు ఆరంభంలో తెలుగు సినిమాను సుసంపన్నం చేశారు. కొంచెం ముందుకు వస్తే విశ్వనాథ్.. బాపు.. రాఘవేంద్రరావు లాంటి లెజెండ్స్ కనిపిస్తారు. ఐతే వీళ్లందరి మధ్య దాసరి చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు. దర్శకుడిగా ఆయనకు వచ్చినంత గుర్తింపు.. పేరు ప్రఖ్యాతులు.. ఇమేజ్.. వేరెవ్వరికీ రాలేదని ఘంటాపథంగా చెప్పొచ్చు.
స్టార్ ఇమేజ్ అన్నది కేవలం హీరోలకే పరిమితం అనుకునే రోజుల్లో దర్శకుడిగా ఆయన వేసిన ముద్ర.. సంపాదించుకున్న అభిమానం అలాంటిలాంటిది కాదు. దాసరికి ఒకప్పుడు 18 వేల అభిమాన సంఘాలుండేవంటే నమ్మగలరా? ఇది అక్షర సత్యం. పోస్టర్ మీద దాసరి పేరు పడిందంటే చాలు.. అందులో హీరో హీరోయిన్లెవరు ఏంటి అని చూడకుండా థియేటర్లకు ప్రేక్షకులు పరుగులు పెట్టేసేవారంటే ఆయనకున్న ఫాలోయింగ్ ఎలాంటిదన్నది అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్.. ఏఎన్నార్.. చిరంజీవి తిరుగులేని మాస్ ఇమేజ్ సంపాదించుకున్న రోజుల్లో.. దర్శకుడై ఉండి వాళ్లకు దీటుగా ఫాలోయింగ్ తెచ్చుకున్న ఘనత దాసరిదే.
దాసరి దర్శకుడయ్యే సమయానికి ఉద్దండులున్నారు. తర్వాత వచ్చిన రాఘవేంద్రరావు నుంచి ఆయనకు సవాలు ఎదురైంది. కానీ ఎప్పుడు ఎంత పోటీ ఉన్నప్పటికీ దాసరి తన ప్రత్యేకతను చాటుకున్నారు. గొప్ప కథాబలం ఉన్న సినిమాలతో అద్భుతమైన సినిమాలు తీసి.. ఎన్టీఆర్ - ఏఎన్నార్ లాంటి సూపర్ స్టార్లకు మైల్ స్టోన్ మూవీస్ అందించి.. తన కంటే ముందున్న దర్శకులందరినీ ఓవర్ టేక్ చేశారు. ఆ తర్వాత వచ్చిన వాళ్లకూ అందని స్థాయిలో నిలబడ్డారు.
ఎంత పెద్ద స్టార్లతో సినిమాలు తీసినా.. కథకు దాసరి ఇచ్చిన ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తాత-మనవడు.. బెబ్బులి పులి.. మేఘ సందేశం.. ప్రేమాభిషేకం.. సర్దార్ పాపారాయుడు.. తాండ్ర పాపారాయుడు.. ఒసేయ్ రాములమ్మ.. ఇలా దాసరి కెరీర్లో మెగా హిట్లుగా నిలిచిన ప్రతి సినిమాలోనూ కథా బలం ఉంటుంది. వాటిలో సామాజిక అంశాలు ముడిపడి ఉంటాయి. ఒక కాజ్ కోసం సినిమాలు తీయాలన్న తపన దాసరిది. రాఘవేంద్రరావు.. తెలుగు సినిమా పంథానే మార్చేసి.. కమర్షియల్ బాట పట్టించినప్పటికీ.. దాసరి మాత్రం తన శైలి వీడలేదు. ఎప్పుడూ కథలో సామాజిక అంశాలకే ప్రాధాన్యం ఇచ్చారు. అదీ ఆయన ప్రత్యేకత. ఇక కేవలం దర్శకుడిగానే కాదు.. నటుడిగా.. రచయితగా.. నిర్మాతగా.. ఇలా పలు విధాలుగా దాసరి తనదైన ముద్ర వేశారు. తనకు తానే సాటి అనిపించుకున్నారు.
దాసరి కేవలం దర్శకుడిగానే కాదు.. వ్యక్తిగానూ సంపాదించుకున్న గౌరవం అసాధారణం. కేవలం పెద్ద దర్శకుడు కాబట్టే ఆయన్ని అందరూ గౌరవించరు. ఆయన వ్యక్తిత్వానికే ఎక్కువ గౌరవమిస్తారు. ఇండస్ట్రీలో వందల మందిని ఆయన ఆదరించారు. ఆయన శిష్యులు పదుల సంఖ్యలో ఉన్నారు. ఒక మోహన్ బాబు.. ఒక ఆర్.నారాయణమూర్తి.. ఒక కోడి రామకృష్ణ.. ఒక రేలంగి నరసింహారావు.. ఇలా ఒక్కొక్కరు దాసరి అనగానే చూపించే అభిమానం.. వారి ప్రేమ చూస్తేనే దాసరి తన శిష్యుల్ని ఎలా చూసుకున్నారో.. ఎలా తీర్చిదిద్దారో అర్థమవుతుంది.
తాను సినిమాల్లో ఇన్ యాక్టివ్ అయిపోయినప్పటికీ పరిశ్రమకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఆయనెప్పుడూ ముందే ఉండేవారు. చిన్న సినిమాల కోసం ఆయనలా తపించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరు. ఇటీవల అనారోగ్యం పాలయ్యే వరకు కూడా దాసరి సినీ రంగంలోని సమస్యల పరిష్కారం కోసమే ఆలోచించేవారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆదుకోవడానికి ముందుకొచ్చేవారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఏ సినీ వేడుకకు ఎవ్వరు పిలిచినా వచ్చి ఆశీర్వదించేవారు. ఎవరికే సాయం కావాలన్నా ఆదుకునేవారు.
దాసరి ఇంట్లో ఎప్పుడూ పదుల సంఖ్యలో సినీ జనాలు భోంచేస్తారంటే ఆయన ఇండస్ట్రీపై ఎంతటి ప్రేమో అర్థం చేసుకోవచ్చు. అందుకే నిన్న మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లు కూడా ఆయన్ని ఎంతో గౌరవిస్తారు. అభిమానం చూపిస్తారు. ఊరికే మాట వరసకు అనడం కాదు కానీ.. నిజంగా దాసరి వెళ్లిపోవడంతో తెలుగు సినీ పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. అలా ఇండస్ట్రీని చేతుల్లోకి తీసుకుని నడిపించిన వ్యక్తి ఇంతకుముందు ఎవ్వరూ లేరు. ఇక ముందూ ఉండరు.
దాసరి గురించి ఇప్పుడే కాదు.. ఆయన ఉన్నపుడు కూడా ఎవ్వరూ చెడుగా మాట్లాడే సాహసం చేయరు. అసలా అవసరం రాదు. దర్శకుడి శిఖర స్థాయికి చేరిన ఆయన.. తన వ్యక్తిత్వంతోనూ అంతే ఎత్తులో నిలిచారు. ఎన్నో విషయాల్లో ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. తనకు తానే సాటి అనిపించుకున్నారు. అందుకే ఈ రోజు ఆయన లేడంటే ప్రతి సినీ అభిమానీ నిజంగా వేదన చెందుతున్నాడు. ఏదో కోల్పోయిన భావనలో ఉన్నాడు. ఈ మహోన్నత వ్యక్తి.. ఈ దిగ్దర్శకుడికి మరోసారి నివాళి అర్పిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తోంది తుపాకి.కామ్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/