కోలీవుడ్ లో వున్న మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో ప్రధమంగా వినిపించే పేరు ధనుష్. తన కోసం కథ కాకుండా కథ కోసం తను అన్నట్టుగా విభిన్నమైన కథలు, పాత్రల్ని ఎంచుకుంటూ సరికొత్త సినిమాలని తెరపైకి తీసుకొస్తుంటాడు. ఆడు కాలం, అసురన్ చిత్రాలతో బెస్ట్ యాక్టర్ గా రెండు నేషనల్ అవార్డ్ లు..
కాకముట్టై, విసారణై సినిమాలతో ఉత్తమ నిర్మాతగా మరో రెండు నేషనల్ అవార్డులు అందుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు. 'రాంఝానా'తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన ధనుష్ ఈ మూవీతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు.
ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్, ద గ్రే మ్యాన్ సినిమాలతో హాలీవుడ్ ప్రేక్షకులని పలకరించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీస్ ధనుష్ కు తీవ్ర నిరాశనే మిగిల్చాయి. ఇదిలా వుంటే గత కొంత కాలంగా తను నటించిన సినిమాలని తెలుగులో డబ్ చేస్తూ రిలీజ్ చేసిన ధనుష్ కొత్తగా తెలుగు మార్కెట్ పై దృష్టి పెట్టాడు. ఇందులో భాగంగా తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీకి శ్రీకారం చుట్టాడు. ధనుష్ హీరోగా తెలుగులో రూపొందుతున్న బైలింగ్వల్ మూవీ 'సార్'.
ఇదే మూవీని తమిళంలో 'వాతి' పేరుతో రూపొందిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. మలయాళ నటి, 'భీమ్లానాయక్' ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. పసితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ వైఫ్ సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది.
షూటింగ్ జరుగుతూనే మరో పక్క రెండు భాషలకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ధనుష్ ఇందులో గవర్నమెంట్ టీచర్గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తూ ప్రభుత్వ పాఠశాలలను ఎలా ధ్వంసం చేస్తున్నాయన్నది బయటపెడతాడట.
ఎడ్యుకేషన్ ని వ్యాపారంగా మార్చి బడాబాబులు ఏం చేస్తున్నారన్నదే ఈ చిత్ర కథగా తెలుస్తోంది. అక్టోబర్ 13న రెండు భాషల్లో ఈ మూవీని విడుదల చేయబోతున్నారు.
ప్రస్తుతం తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్న ధనుష్ తమిళ వెర్షన్ ని ఎంజాయ్ చేస్తూ చెబుతున్నాడట. తెలుగు వెర్షన్ వచ్చే సరికి మొక్కుబడిగా మమా అనిపించేస్తున్నాడట. దీంతో టీమ్ ధనుష్ సార్ తెలుగు డబ్బింగ్ తేలిపోతోంది సార్ అని బావురు మంటున్నారట. ఇలాగేతే ధనుష్ తో బైలింగ్వల్ కష్టమే అని కామెంట్ లు వినిపిస్తున్నాయి.