మూడున్నరేళ్ల విరామం తరువాత `వకీల్ సాబ్` చిత్రంతో మళ్లీ కెమెరా ముందుకొచ్చారు పవర్ స్టార్ పవన్ కట్యాణ్. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ `పింక్` ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఎవరూ ఊహించని విధంగా దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ పవన్ కల్యాణ్ కు భారీ బ్లాక్ బస్టర్ ని అందించింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగానూ సరికొత్త రికార్డులు సృష్టించింది.
ఇక ఈ మూవీ తరువాత కూడా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఊహించని వ్యక్తికి దర్శకత్వం వహించే బాధ్యతల్ని అప్పగించారు. అతనే సాగ్ కె. చంద్ర. అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న సాగ్ కె. చంద్ర `భీమ్లానాయక్` చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించిన వసూళ్ల పరంగా కూడా చర్చనీయాంశంగా నిలిచింది.
ప్రస్తుతం క్రిష్ డైరెక్ట్ చేస్తున్న పీరియాడికల్ మూవీ `హరి హర వీరమల్లు` చిత్రాలో నటిస్తున్నారు పవన్. గత 15 నెలలుగా షూటింగ్ నిరవధికంగా వాయదా పడుతూ వస్తున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ ఎట్టకేలకు ఈ ఏప్రిల్ 6 నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కాబోతోంది.
గత కొంత కాలంగా పవన్ డేట్స్ కారణంగా డిలే అవుతున్న ఈమూవీ కోసం పవన్ ఏకంగా ఐదు నెలలు కేటాయించడం విశేషం. 17వ శతాబ్దం నేపథ్యంలో అత్యంత భారీ స్థాయిలో రూపొందనున్న ఈమూవీ కోసం ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ పద్మశ్రీ తోట తరణి నేతృత్వంలో బారీ సెట్ లని హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేశారు.
ఈ సెట్ లలోనే కీలక ఘట్టాలని చిత్రీకరించబోతున్నారు. ఇదిలా వుంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రానా తో `విరాటపర్వం` వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన వేణు ఊడుగుల తో పవన్ కల్యాణ్ ఓ భారీ సినిమాని చేయబోతున్నారట. ఇప్పటికే ఆయనతో చర్చలు జరిపారని, ప్రాజెక్ట్ ని ఫైనల్ చేశారిన వార్తలు వినిపిస్తున్నాయి.
ఓ విభిన్నమైన నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ నిర్మించే అవకాశం వుందని అంటున్నారు. ఇలా పవన్ వరుసగా ఊహించిన దర్శకులకు అవకాశాలు ఇస్తుండటం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే `వినోధాయ సితం` ప్రాజెక్ట్ ని సముద్ర ఖని డైరెక్షన్ లో చేయడానికి రెడీ అయిపోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా వేణు ఊడుగుల కు పవన్ అవకాశం ఇవ్వబోతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.