బడా నిర్మాత ప్లాన్ అదే !

Update: 2020-03-13 02:30 GMT
నాని -సుదీర్ బాబు కాంబినేషన్ లో వస్తున్న 'V' సినిమాకు సంబంధించి షూటింగ్ సమయంలోనే రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నారు మేకర్స్. నాని ఇరవై ఐదో సినిమా కావడంతో మార్చ్ 25 న రిలీజ్ చేయాలనుకున్నారు. ప్రమోషన్ కూడా మొదలెట్టేసారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉంది. కరోనా ఎఫెక్ట్ ఈ సినిమా రిలీజ్ పై పడింది. జనాలు థియేటర్స్ , షాపింగ్ మాల్స్ కి దూరంగా ఉంటున్నారు. అందువల్ల ప్రస్తుతం థియేటర్స్ జనాలు లేక వెలవెలబోతున్నాయి.

దీంతో సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు దిల్ రాజు. అయితే ఇంత వరకూ వాయిదా విషయం బయటికి చెప్పలేదు. దీనికి రీజన్ కూడా ఉంది. అవును ప్రస్తుతం విదేశాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. భారతదేశం సేఫ్ గానే ఉన్నప్పటికీ జనం భయపడుతున్నారు. సో అందుకే మరో వారం చూసి పరిస్థితి ఇలాగే ఉంటే అప్పుడు సినిమాను వాయిదా వేసుకుంటారు.

ఇదే రాజు గారి ప్లాన్. మరి బడా నిర్మాత ప్లాన్ అనుకున్నట్టు జరిగి వారం లోగ పరిస్థితి సాధారణంగా ఉంటే ఎట్టిపరిస్థితుల్లో మార్చ్ 25 నే 'V'రంగంలోకి దింపుతారనేది పక్కా.
Tags:    

Similar News