స్టార్ ప్రొడ్యూసర్ అయినా.. హీరోల డేట్స్ కుదరక కొంతకాలంగా చిన్న సినిమాలతో కాలం వెళ్లదీస్తున్న దిల్ రాజుకు.. 2017 కీలకంగా మారిపోయింది. ఈయన ఈ ఏడాది లైన్ లో పెట్టిన సినిమాలన్నీ క్రేజీ ప్రాజెక్టులే కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
మొదటగా సంక్రాంతికి శతమానం భవతి అంటూ శర్వానంద్ హీరోగా నటించిన సినిమా రిలీజ్ చేస్తున్నాడు దిల్ రాజు. ఈ చిత్రంపై దిల్ రాజుకు చాలా చాలా కాన్ఫిడెంట్ ఉందని ఇండస్ట్రీ జనాల టాక్. ఆ తర్వాత సమ్మర్ నాటికి అల్లు అర్జున్ హీరోగా నటించిన డీజే-దువ్వాడ జగన్నాధం రిలీజ్ కానుంది. వరుసగా మూవీమూవీకి రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న బన్నీ.. ఈ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొడతాడనే అంచనాలు పుష్కలంగా ఉన్నాయి. నాని-కీర్తి సురేష్ జంటగా నటించిన నేను లోకల్ దాదాపు రిలీజ్ కి రెడీ అయిపోయింది. నాని జోరును మరింతగా పెంచే సినిమా ఇది అని ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
మరోవైపు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఫిదా కూడా ఇదే ఏడాది విడుదల కానుంది. వీటితో పాటు రవితేజ హీరోగా- అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపందనున్న చిత్రం కూడా ఈ ఏడాదిలోనే విడుదల కావాల్సి ఉంది. ఇక డబ్బింగ్ చిత్రాల విషయానికి వస్తే.. మణిరత్నం డ్యుయెట్ కు తెలుగు వెర్షన్ నిర్మాత దిల్ రాజే. ఈ సినిమాల బిజినెస్ అన్నీ కలిపితే.. కొత్త ఏడాదిలో దిల్ రాజు కనీసం 120-130 కోట్ల బిజినెస్ ఈజీగా చేసేస్తాడని ఇండస్ట్రీ జనాలు చెప్పుకుంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/