అక్కినేని అఖిల్ హీరోగా ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో కొన్ని పర్వాలేదు అనిపించినా కూడా ఓవరాల్ గా అఖిల్ కు ఇప్పటి వరకు కమర్షియల్ గా బిగ్గెస్ట్ సక్సెస్ అయితే పడిందే లేదు. అఖిల్ అక్కినేని ప్రస్తుతం చేస్తున్న ఏజెంట్ సినిమా పై అభిమానులు చాలా అంచనాలు పెంచుకుని ఉన్నారు. అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా పై అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు.
ఏజెంట్ సినిమా ను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ చేస్తున్నాడు. కరోనా వల్ల ఆలస్యం అయిన ఏజెంట్ సినిమాను ఎట్టకేలకు ముగించి ఈ ఆగస్టు లో విడుదల చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఏజెంట్ సినిమా తర్వాత అఖిల్ చేయబోతున్న సినిమా విషయంలో రకరకాల పుకార్లు ఇప్పటికే షికార్లు చేయడం జరిగింది.
ఇప్పుడు కొత్తగా ఏజెంట్ తర్వాత అఖిల్ సినిమా గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా గాడ్ ఫాదర్ అనే రీమేక్ ను రూపొందిస్తున్న మోహన్ రాజా ఆ సినిమా ను ఆగస్టు లో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. తమిళంలో మంచి దర్శకుడిగా పేరు దక్కించుకోవడంతో పాటు సక్సెస్ లను కూడా దక్కించుకున్న ఘనత ఆయనకు దక్కుతుంది.
తెలుగు లో గాడ్ ఫాదర్ తో ఆయన ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో ఆ వెంట వెంటనే ఆయనకు ఆఫర్లు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. అందులో భాగంగానే అఖిల్ కు ఒక స్క్రిప్ట్ ను రెడీ చేయమని అక్కినేని ఫ్యామిలీ వర్గాల వారు దర్శకుడు మోహన్ రాజాకు తెలియజేయడం జరిగింది... ఆయన తన వద్ద అప్పటికే ఉన్న ఒక కథను అఖిల్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా మార్చి ఇచ్చాడట.
అఖిల్ టీమ్ కు ఆ కథ నచ్చడంతో త్వరలోనే నాగార్జున కూడా ఆ కథ వింటాడనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై స్పష్టత రావాల్సి ఉంది. అఖిల్ ఏజెంట్ సినిమా విడుదల అవ్వడానికి మరీ ఎక్కువ సమయం లేదు. కనుక తదుపరి సినిమాను ముందుగానే కన్ఫర్మ్ చేసుకుంటే మంచిదనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఏజెంట్ తో కమర్షియల్ హిట్ కొడితే అఖిల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన తదుపరి సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉంది. ఆ తదుపరి సినిమా ఎవరితో అనే విషయం లో క్లారిటీ రావాల్సి ఉంది.