నిషేధిత నటుడిని తీసుకొస్తున్న ఎన్టీఆర్

Update: 2017-04-06 04:26 GMT
జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పేరు జై లవ కుశ. ఇప్పటికే ఈ టైటిల్ తో లోగో లుక్ కూడా విడుదల చేసేయడం.. సోషల్ మీడియాలో ఈ లోగో లుక్ వరల్డ్ వైడ్ గా ట్రెండింగ్ అయిపోవడం కూడా చూసేశాం. ఎన్టీఆర్ షూటింగ్ లో జాయన్ అయ్యాక షెడ్యూల్ ను దాదాపు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రానికి.. ఇప్పుడు మెయిన్ విలన్ ను కన్ఫాం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

జై లవ కుశలో విలన్ పాత్రలో నటించేందుకు కన్నడ నటుడు దునియా విజయ్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. గతేడాది నుంచి ఇతనిపై తాత్కాలిక నిషేధం ఉంది. మాస్తిగుడి షూటింగ్ లో భాగంగా ఇద్దరు ఫైటర్లు ప్రమాదంలో మరణించిన తర్వాత.. ఇతనిపై శాండల్ వుడ్ టెంపరరీ బ్యాన్ విధించింది. జై లవ కుశలో లీడ్ విలన్ పాత్ర కోసం ఇతన్ని సంప్రదించాడట దర్శకుడు. స్క్రిప్ట్ నచ్చడంతో పాటు తన కేరక్టర్ కూడా నచ్చడంతో.. వెంటనే ఓకే చెప్పేశాడట దునియా విజయ్. ప్రధాన విలన్ పాత్రలో ఇతన్నే కన్ఫాం చేసుకున్నారని అంటున్నారు.

అయితే.. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సినిమా గురించి అప్ డేట్స్ తానే ఇస్తానంటూ.. గతంలోనే నిర్మాత కళ్యాణ్ రామ్ స్పందించాడు. ఈ జై లవ కుశ చిత్రానికి గాను మరో ఇద్దరు హీరోయిన్లను ఫైనలైజ్ చేయాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News