యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘అరవింద సమేత’. భారీ అంచనాలున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా విదేశాల్లో పాట చిత్రీకరించడంతో షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేశారు. దసరాకు విడుదల కాబోతున్న ఈ చిత్రంకు లీక్ ల బెడద తప్పడం లేదు. గతంలో సినిమాకు సంబంధించిన ఫొటోలు లీక్ అయ్యాయి. తాజాగా ఒక హై ఓల్టేజ్ యాక్షన్ సీన్ లీక్ అయ్యింది. ఆ యాక్షన్ సీన్ ను త్రివిక్రమ్ తన మార్క్ కు పూర్తి భిన్నంగా తెరకెక్కించాడు. సినిమాకే హైలైట్ గా ఆ యాక్షన్ సీన్ నిుస్తుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు. తాజాగా ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర విషయం ఒకటి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
చిత్ర కథలో భాగంగా స్థానిక ఎన్నికల ఎపిసోడ్ ఉండబోతుందట. ఆ ఎన్నికల ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా ఉంటుందని సమాచారం అందుతుంది. ఆ ఎన్నికల ఎపిసోడ్ లో తన వర్గం వారి కోసం ఎన్టీఆర్ ప్రచారం చేయనున్నాడట, ఎన్నికల ప్రచారం సమయంలో డైలాగ్స్ త్రివిక్రమ్ మార్క్ ను కలిగి ఉంటాయని, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఆ ఎన్నికల సీన్ ఉంటుందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది.
ఎన్టీఆర్ ‘జై లవకుశ’ చిత్రం తర్వాత కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని చేశాడు. ఆ కారణంగా నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నాగబాబు కనిపించబోతున్నాడు. మొదటి సారి ఎన్టీఆర్, నాగబాబుల కాంబో అవ్వడం కూడా సినిమాకు కలిసి వచ్చే అవకాశంగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.