బాలీవుడ్ స్టార్స్ పెళ్లి వేడుకలు ఎంత వైభవంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి పెళ్లిళ్లకు వచ్చే బహుమానాలు కూడా అంతే ఖరీదుగా ఉంటాయి. సన్నిహితులకు మరియు స్నేహితులకు బాలీవుడ్ స్టార్స్ ఇచ్చే పెళ్లి కానుకలు లక్షలు... కోట్లలో రేట్లు ఉంటాయి అనడంలో సందేహం లేదు. తాజాగా ఒక్కటి అయిన బాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్ మరియు కత్రీనా కైఫ్ లకు బాలీవుడ్ స్టార్స్ నుండి పెద్ద మొత్తంలో కానుకలు వచ్చాయి. బాలీవుడ్ కు చెందిన ఒక మీడియా సంస్థ ఇచ్చిన కథనం ప్రకారం ఈ జంటకు ఏకంగా 15 కోట్ల రూపాయల విలువైన పెళ్లి కానుకలు వచ్చాయట. అందులో సల్మాన్ ఖాన్ మరియు రణబీర్ కపూర్ లు ఇచ్చిన కానుకల ఖరీదు దాదాపుగా ఆరు కోట్ల రూపాయల వరకు ఉంటుందని వారు విశ్లేషించారు.
కత్రీనా కైఫ్ కెరీర్ ఆరంభంలో సల్మాన్ ఖాన్ తో ప్రేమలో ఉన్నట్లుగా పుకార్లు షికార్లు వచ్చాయి. అందులో నిజం ఎంత అనే విషయం తేలే లోపే ఇద్దరు బ్రేకప్ అంటూ వార్తలు వచ్చాయి. దాంతో వీరిద్దరిని కూడా ఎక్స్ లవర్స్ అనే పిలుస్తూ ఉంటారు. ఆ తర్వాత రణబీర్ కపూర్ తో కూడా కత్రీనా కైఫ్ ప్రేమలో పడ్డట్లుగా వార్తలు వచ్చాయి. ఆ విషయం పై కూడా స్పష్టత రాలేదు. ఇద్దరి మద్య మంచి స్నేహం అయితే ఉండేది. ఆ స్నేహం చెడిపోయి ఇద్దరు కూడా గొడవ పడి విడిపోయారు. దాంతో ఈ జంటను కూడా ఎక్స్ లవర్స్ అంటూ నెటిజన్స్ మరియు మీడియా వర్గాల వారు పిలుస్తూ వస్తున్నారు. కత్రీనా కైఫ్ మరియు విక్కీ కౌశల్ ల పెళ్లికి ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ గా మీడియా ప్రచారం చేస్తున్న సల్మాన్ ఖాన్ మరియు రణబీర్ లు భారీ మొత్తంలో కానుకలు ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కత్రీనా కైఫ్ కు సల్మాన్ ఖాన్ మూడు కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ కారును బహుమానంగా ఇవ్వడం జరిగిందట. పెళ్లికి ముందే ఆ జంటకు ఈ కానుక చేరిపోయిందట. ఇక కత్రీనా కోసం వజ్రాల నక్లెస్ ను రణబీర్ కపూర్ చేయించాడు. దాని ఖరీదు కూడా దాదాపుగా మూడు కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. ఇంకా పలువురు బాలీవుడ్ స్టార్స్ కత్రీనా మరియు విక్కీ కౌశల్ కు బహుమానాలు ఇచ్చారు. వాటిలో హృతిక్ రోషన్ ఇచ్చిన బీఎండబ్ల్యూ బైక్ ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఆలియా భట్ కొత్త దంపతులకు లక్షల విలువ చేసే అరుదైన సెంట్ బాటిల్ ను కానుకగా పంపించిందట. ఇంకా లక్షల రూపాయల్లో ఖరీదు అయిన ఎన్నో కానుకలు ఇండస్ట్రీ వర్గాల నుండి మరియు వ్యాపార వర్గాల నుండి కూడా వీరికి అందాయి అనేది టాక్. సెలబ్రెటీలు.. స్టార్స్ పెళ్లి చేసుకున్నా అంతే రేంజ్ లో ఉంటుందని దీంతో మళ్లీ నిరూపితం అయ్యింది.