మూడున్నరేళ్ల విరామం తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ `వకీల్ సాబ్` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. కోవిడ్ సెకండ్ వేవ్ లో థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. దీంతో మళ్లీ పవర్ స్టార్ అభిమానుల్లో కొత్త జోష్ మొదలైంది. మళ్లీ తమ హీరో సినిమాల్లో నటించడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ మూవీ తరువాత పవన్ నటిస్తున్న చిత్రం` భీమ్లా నాయక్`.
త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్న సినిమా కావడం, ఇప్పటికే విడుదలైన టీజర్, లిరికల్ వీడియోలు ఓ రేంజ్ లో వుండటంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా?.. ఎప్పుడెప్పుడు చూడాలా అని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నామంటూ ఆ మధ్య మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఆ డేట్ ల విషయంలో ఎలాంటి అప్ క్లారిటీ ఇవ్వలేదు.
అయితే ఈ మూవీ రిలీజ్ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంటే ఓ అభిమాని మాత్రం ఈ మూవీ టికెట్ కోసం ఇంట్లో డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. `భీమ్లా నాయక్` మూవీ అడ్వాన్స్ బుకింగ్ మొదలు కాబోతోందని, అందరి లాగే తనూ ఈ మూవీని ఫస్ట్ రోజే చూడాలని భావించిన జగత్యాలలోని పురానీ పేటకు చెందిన 11 ఏళ్ల అభిమాని టికెట్ కోసం ఇంట్లో డబ్బులు అడిగాడట. ఎనిమిదవ తరగతి చదువుతున్న సదరు కుర్రాడు సినిమా టికెట్ కోసం రూ. 300 కావాలని తండ్రిని అడిగాడట.
అయితే తండ్రి దినసరి కూలీ కావడంతో అంత డబ్బు ఇవ్వడానికి నిరాకరించాడట. కుర్రాడు మరీ బెట్టుచేయడంతో సరే అని చెప్పిన తండ్రి తనకు కొంత సమయం కావాలని చెప్పాడట. దీంతో మనస్తాపానికి గురైన కుర్రాడు తలుపులు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడట. అనుమానం వచ్చి తల్లిదండ్రులు తలుపులు తెరవడంతో కుర్రాడు ఉరివేసుకుని కనిపించిందిని, అది చూసి తల్లిదండ్రులు బోరున విలపించారని తెలిసింది.
ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఊహించని పరిణామానికి కుర్రాడి తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారని, ప్రస్తుతం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. అభిమానం వుండాలే కానీ మరీ ఇంతలా వెర్రితలు వేసే స్థాయిలో వుండకూడదని, సినిమా టికెట్ డబ్బుల కోసం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఏంటని పలువురు పెదవి విరుస్తున్నారు.