టాలీవుడ్ లో మునుపెన్నడూ లేని మార్పు మొదలైంది. `బాహుబలి` తరువాత దేశ వ్యాప్తంగా వున్న సినీ ప్రియులతో పాటు వరల్డ్ సినిమా టాలీవుడ్ వంక చూస్తోంది. ప్రతీ సినిమా ఏదో ఒక ప్రత్యేకతతో రూపొందుతూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలుస్తోంది. మల్టీస్టారర్ చిత్రాలతో పాటు పాన్ ఇండియా మూవీస్ లతో ఇప్పడు టాలీవుడ్ కళకళలాడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితులు మారడంతో గత కొంత కాలంగా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న భారీ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ థియేటర్లలో సందడి రెడీ అయిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో పవన్ స్టార్ పవన్ కల్యాణ్, రానా కలిసి నటించిన `భీమ్లా నాయక్` ఎట్టకేలకు విడుదల కాబోతోంది. మల్టీస్టారర్ మూవీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్ర రిలీజ్ గత కొన్ని రోజలుగా సందిగ్ధంలో పడిన విషయం తెలిసిందే. తాజాగా మేకర్స్ గతంలో ప్రకటించిన ఫిబ్రవరి 25నే `భీమ్లా నాయక్` చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించి ఈ మూవీ రిలీజ్ పై నెలకొన్న గందరగోళంపై క్లారిటీ ఇచ్చారు. దీంతో పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
`వకీల్ సాబ్` తరువాత పవన్ నుంచి వస్తున్న మాసీవ్ మూవీ కావడంతో ఈ చిత్రంపై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. మలయాళ బ్లాక్ బస్టర్ అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ మూవీని సాగర్ కె. చంద్ర తెరకెక్కించారు. పవర్ ఫుల్ మాసీవ్ పోలీస్ కి.. లోకల్ డాన్ కీ మధ్య సాగే ఈగో వార్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కరించారు. మాస్ కు నచ్చే అంశాలన్ని పుష్కలంగా వున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగానూ ఈ మూవీ భారీ క్రేజ్ ని సొంతం చేసుకుంది. తమన్ అందించిన టైటిల్ సాంగ్ , గ్లింప్స్ రిలీజ్ అయిన దగ్గరి నుంచే ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. దానికి ఏ మాత్రం తీసిపోని స్థాయిలో సినిమా వుండబోతోందని ఆ తరువాత విడుదలైన టీజర్ తో స్పష్టం కావడంతో ఫ్యాన్స్ ఈ మూవీ రిలీజ్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
వారి కోసం త్వరలోనే ఓ భారీ ఈవెంట్ ని నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మంగళవారం రిలీజ్ డేట్ ని ప్రకటించి షాకిచ్చిన మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలని స్పీడప్ చేయబోతున్నారట. ఇందులో భాగంగా పవర్ స్టార్ అభిమానుల మధ్యకు రాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 21న యూసఫ్ గూడా లోని పోలీస్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. `వకీల్ సాబ్` తరువాత జరగనున్న పవన్ ఫంక్షన్ కావడంతో ఫ్యాన్స్ కి ఇక పూనకాలే అంటున్నారు.
ఇదిలా వుంటే అప్పడే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయట. అంతే కాకుండా ప్రీమియర్ షోలకు సంబంధించిన బుకింగ్స్ కూడా జోరుగా మొదలయ్యాయని అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా ఈ సందడి మొదలు కావాల్సి వుందని తెలిసింది. 2 గంటల 21 నిమిషాల రన్ టైమ్ ని కూడా ఇప్పటికే మేకర్స్ లాక్ చేశారని, దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే బయటికి రానున్నట్టుగా తెలిసింది.