గబ్బర్‌సింగ్‌-2 కాదు.. ఇంకోటి

Update: 2015-06-10 07:30 GMT
రెండేళ్లకు పైగా కొనసాగుతున్న నిరీక్షణకు తెరదించుతూ మే 31న గబ్బర్‌సింగ్‌-2 షూటింగ్‌ మొదలుపెట్టించేశాడు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌. పుణె దగ్గర్లోని ఓ పల్లెటూర్లో హీరో లేకుండానే తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకుని వచ్చేశాడు డైరెక్టర్‌ బాబీ. పవన్‌ కళ్యాణ్‌ ఖాళీ అయితే వచ్చే నెలలో రెండో షెడ్యూల్‌ హైదరాబాద్‌లోనే మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఐతే గబ్బర్‌సింగ్‌-2 గురించి గత రెండేళ్లలో వచ్చిన రూమర్లు సరిపోవని.. ఇప్పుడు ఇంకో రూమర్‌ ఒకటి బయల్దేరింది. అదే.. గబ్బర్‌సింగ్‌-2 టైటిల్‌ మార్పు.

గతంలో తెలుగులో సీక్వెల్స్‌గా వచ్చిన సినిమాలకు చాలా వరకు వెనుక '2' తగిలించేసి లాగించేశారు. కానీ వాటికి సరైన ఫలితాలు రాలేదు. అందుకే గబ్బర్‌సింగ్‌ సీక్వెల్‌కు కొత్త టైటిల్‌ పెట్టాలని భావిస్తున్నారట. కథ కూడా పూర్తిగా కొత్తది ఎంచుకున్నారు కాబట్టి.. ఇందులో సీక్వెల్‌ లక్షణాలేమీ ఉండవు కాబట్టి టైటిల్‌ మార్చడం బెటర్‌ అని భావిస్తున్నారట. ఆ మధ్య నిర్మాత శరత్‌ మరార్‌ రిజిస్టర్‌ చేయించిన 'సర్దార్‌' టైటిల్‌నే దీనికి వాడుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఐతే సూపర్‌ పాపులరైన గబ్బర్‌సింగ్‌ టైటిల్‌ను పక్కనబెట్టేస్తే పవన్‌ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.



Tags:    

Similar News