ప్రస్తుతం వెబ్ సిరీస్ ల టైం నడుస్తోంది. రెండున్నర మూడు గంటల సినిమాను థియేటర్ కు వెళ్లి చూడటం కంటే వెబ్ సిరీస్ లను చూసేందుకు ఈతరం ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ముందు ముందు వెబ్ సిరీస్ ల హవా ఇంకా పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వెబ్ సిరీస్ లు వచ్చినా కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ కు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎనిమిదేళ్లుగా ప్రసారం అవుతున్న ఈ సిరీస్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.
ఎనిమిది సంవత్సరాలుగా ఎనిమిది సిరీస్ లుగా ఈ సీరియల్ ప్రసారం అవుతూ వస్తోంది. హెచ్ బి వో ఛానెల్ లో ప్రసారం అయ్యే ఈ వెబ్ సిరీస్ ఈ సంవత్సరంలో ప్రసారం కావడం లేదని నిర్మాతలు తేల్చి చెప్పారు. గత సంవత్సరంలోనే వచ్చే ఏడాదితో ఈ వెబ్ సిరీస్ ముగుస్తుందని ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ కు విపరీతమైన అభిమానులు ఉన్నారు. వారంత కూడా ఎప్పుడెప్పుడు చివరి సీజన్ ప్రారంభం అవుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు. వారందరికి షాక్ ఇస్తూ ఈ సంవత్సరం లేదని, వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించారు. దాంతో ఈ సిరీస్ అభిమానులు అంతా కూడా తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. వచ్చే ఏడాదిలో ఆరు ఎపిసోడ్ లతో ఈ సిరీస్ ను ముగించబోతున్నట్లుగా ప్రకటించారు. కేవలం ఆరు ఎపిసోడ్ల కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులు ఇప్పటి నుండే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు.