గోకుల్ చాట్ .. లుంబిని పార్క్ పేలుళ్ల వెనక నిజం థియేటర్లకు రప్పిస్తుందా?
కింగ్ నాగార్జున నటిస్తున్న థ్రిల్లర్ మూవీ `వైల్డ్ డాగ్` ఏప్రిల్ 2 న థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆశిషర్ సోలమన్ దర్శకత్వం లో మ్యాటినీ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నిజానికి ఈ సినిమాకి ఓటీటీలో భారీ ఆఫర్ వచ్చినా దానిని కాదనుకుని థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేసింది చిత్రబృందం.
అయితే ఈ సినిమా విజయంపై టీమ్ ధీమా ఏమిటి? అన్నది పరిశీలిస్తే ఇంట్రెస్టింగ్ విషయాలే ఉన్నాయి. వైల్డ్ డాగ్ కథాంశం ఆద్యంతం ఇంట్రెస్టింగ్ . ఒక వార్తాపత్రికలోని ఒక చిన్న కథనం `వైల్డ్ డాగ్` కథకు ప్రేరణ. 2007 లో గోకుల్ చాట్ .. లుంబిని పార్క్ పరిసరాల్లో బాంబు పేలుళ్ల తరువాత 2015 వరకు మన దేశంలో అనేక బాంబు పేలుళ్లు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం ఈ కేసును ఎన్‌ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) కు బదిలీ చేసింది. ఈ ఘటనలనే సినిమాగా మలిచారు.
నిజమైన సంఘటనల ఆధారంగా కొన్ని కల్పిత అంశాలు స్క్రిప్ట్ లో చేర్చి కమర్షియల్ పంథాలో రూపొందించారు. ఆరు పాటలు ఫైట్లు కామెడీ ట్రాక్ తో తెరకెక్కే రొటీన్ కమర్షియల్ చిత్రం కాదు. గ్రిప్పింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమా ఆద్యంతం ఆకర్షణీయంగా ఉంటుంది. తెలుగు ప్రేక్షకుల మారిన అభిరుచిని పరిగణనలోకి తీసుకుని సినిమాటిక్ లిబర్టీస్ తో దర్శకుడు రూపొందించారు.
ఓటీటీ ఆఫర్ ను ఎందుకు తిరస్కరించారు? అన్న ప్రశ్నకు దర్శకుడు తాజాగా సమాధానమిచ్చారు. నిజానికి వైల్డ్ డాగ్ కు లాభదాయకమైన OTT ఆఫర్ వచ్చింది. అలాంటి విడుదల సరైనదేనా అని నిర్మాత నిరంజన్ రెడ్డి నన్ను అడిగారు. నేను సానుకూలంగా స్పందించాను. కానీ అదే సమయంలో 50 శాతం ఆక్యుపెన్సీతో విడుదలైన క్రాక్ మంచి వసూళ్లను సాధించింది. దాంతో ఆలోచన మార్చుకున్నాం. మా చిత్రాన్ని థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాము. నిజానికి వైల్డ్ డాగ్ థియేట్రికల్ అనుభవం కోసం రూపొందించిన చిత్రం. కానీ అప్పటి పరిస్థితుల కారణంగా మేము ఓటీటీ గురించి ఆలోచించాం`` అని తెలిపారు.