దిగ్గజ దర్శకుడు మణిరత్నం రూపొందించిన చెలియా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఇప్పటికే టీజర్.. ట్రైలర్లతో బోలెడంత హంగామా నడిచిపోతుండగా.. ప్రత్యేక ఇంటర్వ్యూలతో ప్రచారం హోరెత్తించేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ఆడియోకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చేయగా.. ఇప్పుడు సాంగ్ ప్రోమోస్ ను కూడా విడుదల చేస్తూ అంచనాలను పెంచేస్తున్నారు.
తాజాగా హంసరో అంటూ సాగే పాటకు 2 నిమిషాల వీడియో రిలీజ్ చేసింది చెలియా యూనిట్. మణిరత్నం స్టైల్ పిక్చరైజేషన్.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్.. అద్భుతాలు చేసేందుకు ఈ రెండూ చాలు కదా. ఆడియో పరంగానే కాదు.. హంసరో వీడియో కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. గతంలో ఓకే బంగారం మూవీలో మెంటల్ మదిలో సాంగ్ రేంజ్ లోనే ఈ హంసరో పాట కూడా ఉండడం విశేషం. ఓకే బంగారం సినిమా రిలీజ్ అయ్యాక 'మన మన మన మెంటల్ మదిలో' అంటూ సాగే పాట సూపర్ డూపర్ హిట్ అయిపోయింది.
ఇప్పుడు 'హంసరో' సాంగ్ కు కూడా ఆ స్థాయి లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మణిరత్నం కూడా ఈ పాట పైనే ఎక్కువగా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నాడని అంటున్నారు. లిమిటెడ్ లొకేషన్స్ లో తీసినా.. ఈ పాట చిత్రీకరణ కోసం ఎక్కువ సమయం కూడా తీసుకున్నారని తెలుస్తోంది. మరి 'హంసరో' మరో మెంటల్ మదిలో అవుతుందో లేదో చూద్దాం.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/