ఈ మధ్య కాలంలో ఏ.ఆర్.రెహ్మాన్ ఊపు ఊపేసిన పాటలను ఏమన్నా కొట్టాడా అంటే.. తెలుగులో ఓ రెండే తగిలాయ్. ''ఓకె బంగారం'' సినిమాలో మన మన మెంటల్ మదిలో.. అలాగే ''సాహసం శ్వాసగా సాగిపో'' సినిమాలో ఛకోరి అంటూ సాగే పాట ఎక్కువగా వినిపిస్తాయ్. అయితే వాటిని మరిపించే సాంగ్స్ ఖచ్చితంగా త్వరలో వచ్చే మణిరత్నం సినిమాతో రెహ్మాన్ అందిస్తాడని తెలుగు మ్యూజిక్ లవర్స్ అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు.
ఇప్పుడు రెహ్మాన్ కంపోజ్ చేసిన ''హంసరో'' అనే పాట విడుదలైంది. మణిరత్నం కొత్త సినిమా ''చెలియా''లోని తొలి పాట ఇదే. అయితే రెహ్మాన్ ఇలాంటి బబ్లీ మెలోడీస్ గతంలో చాలానే కంపోజ్ చేశాడు. అందుకే ఈ పాట వింటే బాగా రొటీన్ గానే అనిపిస్తోంది. ముఖ్యంగా ఏదన్నా హుక్ లైన్ తో సాధారణంగా మనోడు చితక్కొట్టేస్తాడు కాని.. ఈ పాటలో మాత్రం హంసరో హంసరో అంటూ సాగే హుక్ చాలా సింపుల్ గా ఉందనే చెప్పాలి. ఎప్పుడూ కూడా రెహ్మాన్ పాటలు కొత్తలో కాస్త డల్ గా ఉండి.. తరువాత తరువాత ఎక్కేస్తాయి. మరి ఈ పాట కూడా ఆ ఖాతాలో చేరుతుందో చేరదో చూడాలి.
ఇకపపోతే ఈ ''చెలియా'' సినిమాను తెలుగులో దిల్ రాజు నిర్మిస్తున్నారు. కార్తి హీరోగా.. అదితీ రావ్ హైదారీ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమాపై మణిరత్నం చాలా నమ్మకాలే పెట్టుకున్నాడు. అది సంగతి.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/