ఫోటో స్టోరీ: భర్తతో క్వారంటైన్‌ లో బిగ్‌ బాస్‌ బ్యూటీ

Update: 2020-04-04 09:30 GMT
బుల్లి తెరపై ఎన్నో సంవత్సరాలుగా సందడి చేస్తూ వస్తున్న హరితేజ బిగ్‌ బాస్‌ తో మరింత స్టార్‌ డంను దక్కించుకుంది. బిగ్‌ బాస్‌ తర్వాత పలు రియాల్టీ షోలతో పాటు పలు కార్యక్రమాలకు హోస్ట్‌ గా చేసే అవకాశాలు దక్కించుకున్న హరితేజ ప్రస్తుతం కూడా పలు షోల్లో కనిపిస్తూనే ఉంది. ఇక ఈ మద్య సినిమాల్లో కూడా బిజీ అవుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితం అవుతుందట.

భర్త దీపక్‌ తో ఈ సమయంను స్పెండ్‌ చేస్తున్నట్లుగా సోషల్‌ మీడియా ద్వారా తెలియజేసింది. ఇన్‌ స్టాగ్రామ్‌ లో హరితేజ పోస్ట్‌ చేసిన ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భర్తతో కలిసి షార్ట్‌ లో కిచెన్‌ లో వంట చేస్తూ బిజీగా ఉంది. హరితేజ ఇంకా దీపక్‌ లతో వారి పెట్‌ ను కూడా ఫొటోలో చూడవచ్చు. పర్‌ ఫెక్ట్‌ క్లిక్‌ అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

దీపక్‌ వంట చేస్తున్నట్లున్నాడు.. మరి నువ్వు ఏం చేస్తున్నావు అమ్మడు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. పలువురు పలు రకాలుగా ఈ ఫొటోకు కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం నేను దీపక్‌ తో కలిసి క్వారంటైన్‌ లో ఉన్నాను. మీరు కూడా ఇంట్లోనే ఉండి సేఫ్‌ గా ఉండండి అంటూ హరితేజ ఈ ఫొటోకు కామెంట్‌ పెట్టి పోస్ట్‌ చేసింది.
Tags:    

Similar News